Powered By Blogger

Tuesday 15 April 2014

రుధిర సౌధం 121






గుడి కనబడింది అన్న రచన మాటలు వైజయంతి గుండెల్లో గుబులు పుట్టించాయి . ఉడికిపోయిన ఆ దెయ్యం

కళ్ళెర్రజేసి మంచి కి నియమం ఉంటుంది కానీ చెడుకి ఎటువంటి నియమం ఉండదు , ఏ ఆత్మ విశ్వాసం తో నీవిలా

మాట్లాడుతున్నావో ఆ ఆత్మ విశ్వాసం పైనే దెబ్బ కొడతా .. సిద్ధం గా ఉండండి . ఈ క్షణం నుండీ మీకీ సత్య

కనబడదు ... కనబడదు .. అని విచిత్రంగా గోడ మీద నడుస్తూ పైన తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల పైన కూర్చుంటూ

 చెప్పింది వైజయంతి .

నో .. నా సత్య ని ఏం చేయకు అరిచాడు పైకి చూస్తూ మురారి .

తన చేతిని తిరుగుతున్న ఫ్యాన్ రెక్కల మథ్య పెట్టింది వైజయంతి .

వేలు కట్ అయిన శబ్దం .. ఆ వెంటనే అమ్మా .. అన్న ఆర్తనాదం ..

సత్యా .. కలవరంగా అంది రచన పైకి చూస్తూ ..

ఇది దాని కేక .. ఇక నుంచీ మీకు నరకం కనబడుతుంది .. అంటూ అక్కడినుంచి బయటికి ఎగురుకుంటూ వెళ్లి

పోయింది వైజయంతి .

జరిగిన సంఘటన ని చూసి మాన్ప్రదిపోయారు మురారి , రచన .

రచనా .. ఏం జరుగుతుంది ? ఇక నా సత్య నాకు కనిపించదా ... ? బేలగా అడిగాడు రచన కళ్ళలోకి సూటిగా

చూస్తూ మురారి .

మురారీ .. ఇలా జరుగుతుందనుకోలేదు .. తనని బెదిరిస్తే తను సత్యని వదలి వెళ్ళిపోతుందని అనుకున్నాను ..

అంది రచన తప్పు చేసి నట్లుగా ..

భగవంతుడా .. అంటూ మోకాళ్ళ పై కూలబడిపోయాడు మురారి .

మురారీ  ప్లీజ్ ధైర్యంగా ఉండు . ఇప్పుడు వైజయంతి సత్య ని మహల్ కె తీసుకేల్లుంటుంది ... మహల్ కి వెళ్లి

చూద్దాం పద మురారీ .. అంది రచన .

అతడు తన రెండు చేతుల్లో మొహం పెట్టుకొని ఏడ్చేశాడు .. నేల పై పడిన రక్తపు చుక్కలని చూసి చూడు రచనా ..

ఇదంతా నా సత్య చిందించిన రక్తం .. ఇంకా  నేను ఏ ధైర్యం తో   ఉండను ? అన్నాడు మురారి .

మురారీ ఆ వైజయంతి వ్యూహమే ఇది మన మానసిక ధైర్యాన్ని సన్నగిల్లేలా చేయటం .. నువ్వు డీలా పడకు ..

నా మాట నమ్ము అంది రచన .

ఒక్కసారిగా తేరుకొని నిజంగా గుడి కనిపించిందా ? అన్నాడు మురారి .

అవును మురారి ..    అంది రచన .

 ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: