Powered By Blogger

Thursday 17 April 2014

రుధిర సౌధం 122





మరి మాతో ఇంతవరకూ ఈ విషయం ఎందుకని చెప్పలేదు ? దాని కోసమే కదా ఇంత శ్రమ , బాధ .. మరి మాతో

చెప్పాలని మీకు అనిపించనే లేదా ? ఆవేశం గా నిలదీశాడు మురారి .

నిజమే మురారి .. మాది తప్పే .. కానీ మీ దగ్గర దాచాలన్నది మా ఉద్దేశ్యం అయితే కాదు .. మీతో ఆ సంతోషం

పంచుకొనే లోపే సరస్వతి సమస్య మన తలుపు తట్టింది .. సమస్యలన్నీ మన చుట్టూ కమ్ముకుంటున్నాయి

మురారీ .. ఇప్పుడు మనం మరింత అప్రమత్తం గా ఉండాలి .. అంతే తప్ప ధైర్యాన్ని కోల్పోకూడదు .. అంది రచన .

నాకే ఆలోచన తట్టడం లేదు రచనా .. మెదడు అంతా మోద్దుబారిపోయినట్లు ఉంది . గుండె ఆగీ ఆగీ కొట్టు

కుంటుంది . అన్నాడు బాధగా మురారి .

మురారీ .. నువ్వు బాధపడటం లో అర్థముంది .. నేను నీ స్థితి ని అర్థం చేసుకోగలను .. కానీ ఇది బాధ పడే

సమయం కాదు మురారీ ... ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మనం .. పోరాడటానికి సిద్ధ పడాలి .. అంది రచన .

అతడు లేచి నించున్నాడు .

అవును .. నువ్వు చెప్పింది నిజం .. ఒక్కోసారి ప్రేమ మన బలహీనత అవుతుంది .. అందుకే డీలా పడిపోయాను .

కానీ ఇప్పుడు అదే ప్రేమ నా బలం .. నా సత్య ని కాపాడుకునేందుకు పోరాడతాను .. అన్నాడు మురారి .

థాంక్ యు మురారీ .. అంది రచన .

అన్నట్టు రచనా నువ్వు చెప్పింది కూడా నిజం . ఆ వైజయంతి మన ప్రాణాలను తీయలేదు .   దానికేదో కారణం

ఉంది .. ఆ కారణం తో మనకి పనిలేదు . ఆ నమ్మకం చాలు .. ఆ మానవాతీత శక్తిని ఎదురించడానికి .. అన్నాడు

మురారి .

అవును మురారి .. కానీ మాటలతో కాలయాపన వద్దు .. ముందు మహల్ కి వెళ్దాం .. అంది రచన .

పద రచనా .. అని ముందుకి కదిలాడు మురారి .

                                                  ************************

భూపతి గదిలో దివాన్ మీద ఒంటరిగా పడుకున్నాడు .

ఇంతలో నాన్నగారూ అంటూ వచ్చాడు రత్నం రాజు .

రా రత్నం .. ఏమైనా మాట్లాడాలా ? అన్నాడు భూపతి .

నాన్నా .. అంటూ దివాన్ చివరన కూర్చుని అతడి కాళ్ళని తన ఒడిలో పెట్టుకొని కాళ్ళు నొక్కటం మొదలు పెట్టాడు

రత్నం రాజు .

ఏ అవసరం వచ్చింది ? తండ్రి కి సేవ చేయాలనే ఆలోచన వచ్చింది ? అన్నాడు భూపతి .

నాన్నా .. ఈ మథ్య ధాత్రి ఇంటికి సరిగ్గా రావటమే లేదు . వచ్చినా ఎక్కువసేపు ఉండటం లేదు ... నా మనసులో

మాట నేను తనతో చెప్పలేక పోతున్నాను . మీరైనా ధాత్రి తో ఈ విషయం కోసం మాట్లాడండి నాన్నా.. అన్నాడు

రత్నం .

చిన్నగా తల పంకించి .. ఆ పిల్ల ఇంటికి రానీ మాట్లాడతా .. అన్నాడు భూపతి .

సంతోషంగా చిరునవ్వు నవ్వాడు రత్నం .


ఇంకా ఉంది

































మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

స్వర్ణమల్లిక said...

Ivaala malli ratnam Raju vachadu tera paiki. Haha.. Vaadi pelli korika akkadito ayipoyindigaa anukunna. Inka climax daggara ki vastondi kanaki ilaantivanni close cheseataaru ga. Baagundi..