Powered By Blogger

Thursday 17 April 2014

రుధిర సౌధం 123

యశ్వంత్ .. సరస్వతి బంధువు లందరూ ఆమె తమ ఇంటికి రాలేదని చెబుతున్నారు . మరైతే ఆమె ఎక్కడ కి

వెళ్లినట్టు ? అసహనం గా అన్నాడు శివ .

అదంతా ఒక ఎత్తైతే పోలీసాఫీసర్ చెప్పింది మరొక ఎత్తు శివా .. ఆమె తన స్టేట్మెంట్ లో భూపతి పట్ల తనకి ఎటువంటి

అనుమానం లేదని చెప్పిందట . ఏం అర్థం కావటం లేదు శివా .. అన్నాడు యశ్వంత్ .

నాకు మాత్రం ఇదంతా పెద్ద కుట్ర ఏమో అనిపిస్తుంది యశ్వంత్ .. అన్నాడు శివ .

అవును శివా ..  ఇదంతా కుట్రే .. అనుమానం లేదు .. ముందు మనం ఊరికి పోవాలి . నా మనసెందుకో కీడు

 సంకిస్తోంది .. అన్నాడు యశ్వంత్  వెహికేల్ స్టార్ట్ చేస్తూ ..

అవును యశ్ .. మురారి కూడా దిగులుగా ఉంటున్నాడు .. వాడి మనసులో ఏముందో తెలియటం లేదు ..

అన్నాడు శివ .

అన్ని సమస్యలు క్లియర్ అవుతాయి శివా .. మీకు నేను ఈ హడావుడిలో పది చెప్పలేదు .. అసలు మధ్యాహ్నం

ఏం జరిగిందో తెలుసా ? అంటూ రచన గౌన్ చిక్కుకు పోవటం నుంచీ గుడి కనిపించటం వరకు అన్ని వివరంగా

చెప్పాడు యశ్వంత్ .

వహ్ .. యశ్వంత్ .. ఇది నిజంగా మంచి విషయం .. ఇకన్ని పరిష్కారమై పోతాయని పిస్తుంది .. కానీ యశ్వంత్

గుడి తలుపులు తెరవట మెలా ? అంత నీటిలో దీపాలు ఎలా పెట్టడం అన్నాడు శివ .

తెలీదు శివా .. కానీ ఇంత వరకూ వచ్చాం .. ఆ పని మాత్రం చేయలేమా ? ఈ పౌర్ణమికి గుడి తలుపులు తెరవాలి ..

అదెలా అన్నది తెలీదు కానీ జరుగుతుంది నాకా నమ్మకం ఉంది .. అన్నాడు యశ్వంత్ .

ఇంత సంతోషమైన విషయాన్ని మనం సెలెబ్రేట్ చేసుకోవాలి కాని అలా జరగటం లేదు .. ఈ సరస్వతి

 ఏమై పోయి ఉంటుందో .. కోపంగా అన్నాడు శివ .

శివా .. ఎందుకో సరస్వతి ఇలా చేయటానికి కూడా ఏదో కారణం ఉండుంటుందని అనిపిస్తుoది నాకు . ఎందుకో

బలంగా ఈ విషయం వెనుక భూపతి హస్తం ఉందని అనిపిస్తుంది నాకు ... అన్నాడు యశ్వంత్ .

నిజానిజాలు దేవునికెరుక యశ్వంత్ ... అన్నాడు శివ

అలా అంటే కుదరదు శివా .. అది మన వృత్తి కె అవమానం ..నివృత్తి చేసుకోవటమే మన ప్రవ్రుత్తి అన్నాడు తమాషా

గా యశ్వంత్

 ఏంటి యశ్ ? తెలుగేనా మాట్లాడేది అన్నాడు నవ్వుతూ శివ .

అనుమానమా ? అయినా ఈ మథ్య ఆ రాణి మహల్ చుట్టూ తిరిగి గ్రాంథిక భాష అలవాటై పోయిందిలే శివా ..

అన్నాడు యశ్వంత్ .

గుండెల్లో ఉన్న ఒత్తిడి ని తగ్గించుకోవటానికి సరదాగా మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు స్నేహితులకి తెలీదు ..

అక్కడ రావణ పురం లో తీవ్ర మైన మానసిక ఒత్తిడి తో నలిగిపోతున్న తమ స్నేహితుల గురించి ...

యశ్వంత్ డ్రైవ్ చేస్తున్న వేహికాల్ రావణ పురం వైపు దూసుకు పోతోంది ...

ఇంకా ఉంది 












మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: