Powered By Blogger

Monday 21 April 2014

రుధిర సౌధం 125

నేను ఒంటరిగానే వెళ్ళాలి మురారీ ,,మంచో చెడో ఆ ఫలితం నేను అనుభవించాలి.. తప్పదు . నా మీద నమ్మక

ముంచు .. నేను సత్యతోనే తిరిగివస్తాను . అంది రచన

సత్య కోసం నిన్ను .. నీకోసం సత్యని బలిపెట్టలేను నేను . నువ్వు వెళ్ళటమే నిశ్చయమై యుంటే నేను నీతో పాటే .

రచన ..   అన్నాడు మొండిగా మురారి .

వైజయంతి ఏం చెప్పింది ? నన్ను ఒంటరిగా రమ్మంది కదా .. లేకపోతె సత్య కి ప్రమాదం . అంది రచన .

కానీ నువ్వే చెప్పావుగా రచన .. వైజయంతి మనలో ఎవర్ని ఏమీ చేయలేదని .. ఆ నమ్మకం తోనే ముందుకి వెళ్దాం

అన్నాడు మురారి .

మన నమ్మకం నిజమో కాదో  తెలియ కుండా కూడా రిస్క్ చేయలేం కదా మురారి   .. అందుకే నన్ను వెళ్ళనీ ..

అంది స్థిరం గా రచన .

నువ్వేన్నైనా చెప్పు రచనా నేను నిన్ను ఒంటరిగా  వదలే ప్రసక్తే లేదు . నా మాట విను .. అన్నాడు మురారి .

 మురారీ  సత్య నావల్లే కష్టాల్లో ఉంది . మీ కళ్ళల్లో బాధ ని ,అసహనాన్ని భరించలేను .. నన్ను వెళ్లనివ్వు మురారీ .

భయాన్ని నీలో పోగొట్టుకొని నా గుండెల్లో నమ్మకాన్ని  అర్థం చేసుకో .. ఈ పని నేను చేయగలను .. ఆ విషయం నా

కళ్ళలోకి చూసి అవగాహన చేసుకో    అంది అతడ్ని సూటిగా చూస్తూ .

అతడు అసక్తత తో సరేనన్నాడు ..

మహల్ విడిచి కొంత దూరం  వెలితె మట్టి బాట వస్తుంది .. అది వైజయంతి  చేప్పిన కోట వైపు తీసుకు వెళుతుంది .

అక్కడికి చేరుకున్నాక....

నువ్వు వెళ్ళు మురారీ .. యశ్వంత్ వాళ్ళతో కూడా చెప్పు ఇక్కడకి రావటానికి ప్రయత్నించవద్దని .. అంది రచన .

రచనా .. నీకేం చెప్పాలో తెలియటం లేదు కానీ ఒక్క మాట .. నీ ధైర్యమే నీ ఆయుధం .. దాన్ని చేజార నివ్వకు ..

మీ  రాక కోసం ఎదురు చూస్తూంటాం .. అన్నాడు నీరసం గా మురారి .

ఆమె చిన్నగా తలూపి వెనక్కి తిరిగి ఆ బాట లో సాగి పోయింది .

నిల్చున్న చోటే కూల బడి బాధ గా రచన వెళ్తున్న వైపు చూశాడు మురారి .

ఆమె తెగువ  కి   మనసు లోనే జోహార్లు  అర్పించాడు మురారి ..

అదే సమయం లో యశ్వంత్ ,శివ వస్తున్న కార్ ఊళ్లోకి ప్రవేశించింది .

గ్రామస్తులు  కొందరు వారిని అడ్డగించటం తో సడెన్ బ్రేక్ వేసాడు యశ్వంత్ .

ఇంకా ఉంది








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: