Powered By Blogger

Monday 21 April 2014

రుధిర సౌధం 126


ఏమయ్యుంటుంది యశ్వంత్ ? వీళ్ళంతా మనకి అడ్డం పడ్డారేంటి ? వాళ్ళ వంక ఆశ్చర్యం గా చూస్తూ అన్నాడు శివ .

జనాలలో ఉన్న సరస్వతి తాత ని చూసి .. వెహికల్ దిగి అతని దగ్గరకి నడిచి ఏమైంది తాతా అని అడిగాడు యశ్ .

ఏమైందని అడుగుతున్నావా ? మీరే కదూ మా సరస్వతి ని మాయం చేసింది .. కోపం గా అన్నాడు తాత .

తాత వైపు అయోమయం గా చూసాడు యశ్వంత్ . శివ కూడా బండి దిగి వచ్చి ఏమన్నావ్ తాతా? మీ సరస్వతి

కనబడడం లేదు అన్నావని ఈరోజంతా మేము తన కోసం వెదికి వస్తుంటే నువ్వు మేమే మాయం చేసావు

అంటున్నావా ? అన్నాడు శివ అసహనం గా .

యశ్వంత్ పరిస్థితి ని అంచనా వేయసాగాడు .

చూడు బాబు .. మా సరస్వతి మీ కాడికే వచ్చినాది .. ఆ తరవాత కనబడలే .. ఎవర్ని అడగాలే ... మిమ్మల్నే గదా..

అన్నాడు తాత .

కానీ తాతా .. సరస్వతి తనే బంధువుల ఇంటికి వెళ్తానని వెళ్ళిపోయింది . అంతే .. మేమేమీ చేయలేదు ... పైగా

మీకు సహాయం చేయాలనుకున్నాం .. అన్నాడు యశ్వంత్ .

లేదు మీరు పట్నమోల్లు .. ఏమైనా చేయగలరు .. మా పిల్ల నేం చేసినారో ఏమో .. దాని మొగుడు ఆ దెయ్యాల కోట

కాడ చనిపోతే ఎవరో చంపేసిన్రని దాని మనసున విషం నింపేసినారు .. అది మిమ్మల్ని నమ్మినాది .. ఇప్పుడు

కనబడదాయే .. ఏడ నుందో నా బిడ్డ .. అన్నాడు గద్గద స్వరం తో తాత .

ఇంకా వీళ్ళతో మాటలేంటి తాతా .. పద భూపతి సామి దగ్గరకి తీసుకుపోదాం .. అన్నాడు జనాల్లోంచి ఎవరో ..

జనం లోంచి నలుగురు వచ్చి యశ్వంత్ శివ ల చేతులు గట్టిగా పట్టుకున్నారు .

వదలండి మమ్మల్ని .. మేము రాగలం .. అన్నాడు యశ్వంత్ .

చూసావా యశ్ .. మనం వీళ్ళకి సహాయం చేయాలనుకుంటే వీళ్ళెం చేస్తున్నారో .. అన్నాడు శివ కోపంగా .

వాళ్ళెవరు వీళ్ళని వదలలేదు .. అంతా కలసి భూపతి దగ్గరకి తీసుకెళ్ళారు యశ్వంత్ ,శివ లని ;

భూపతి తన బంగ్లా ముందు కుర్చీ వేసుకొని వీరి కోసమే వేచి చూస్తున్నట్టు కూర్చున్నాడు ..

భూపతి ఎదురుగా నిలబెట్టాక వారి చేతుల్ని విడిచి పెట్టారు ఆ నలుగురు .

భూపతి వీళ్ళని చూసి ఓ విషపు నవ్వు నవ్వాడు .. ఆ నవ్వు లో విజయ గర్వం ఉంది .

యశ్వంత్ ,శివ భూపతి వైపు సూటిగా చూసారు .

ఏమయ్యా పట్నం బాబులు .. మీకు మా ఊరి పిల్ల అదీ మొగుడు చచ్చిన ఆడదే కావాల్సి వచ్చిందా ? ఏం చేసారు

ఆ పిల్ల ని ? వెటకారంగా అడిగాడు భూపతి .

కొంచెం మర్యాదగా మాట్లాడు భూపతీ .. గర్జించాడు శివ .

భూపతిగారు అవకాశం కోసం కాచుక్కూచున్న ఓ గుంట నక్క విన్యాసం ఇదని మాకు తెలుసు . మమ్మల్ని

ప్రశ్నించే ముందు ఒక్కసారి ఆలోచించుకున్నారా ? సింహం ముందు నక్క విన్యాసాలు చెల్లవని .. అన్నాడు

యశ్వంత్  .

భూపతి కి కోపం తారా స్థాయి కి పెరిగింది .

ఇంకా ఉంది 




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: