Powered By Blogger

Tuesday 22 April 2014

రుధిర సౌధం 127


మీ అసందర్భ ప్రేలాపనలు ఆపండి .నిన్నటి రోజు సరస్వతి  మీతో పాటు ఉందా లేదా ? అన్నాడు భూపతి ..

భూపతీ రంగస్థలం వెనుక ఏం జరిగిందో ఊహించలేనంత పిచ్చివాళ్ళం కాదు మేము .. ఇదుగో ఈ జనం ..

అమాయకులు నీ మాటలు నమ్మి ఇక్కడ పోగయ్యారు . కానీ నిజం అన్నది కళ్ళ ముందు నిలబడితే నీ పరిస్థితి

ఏంటి ? వీళ్ళందరి మధ్య మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలన్న పంతం లో నువ్వూ తప్పులు చేస్తావు భూపతీ ..

కానీ మా గురించి తప్పుడు అంచనాకి వస్తే ఫలితం చేదుగా ఉంటుంది భూపతీ అన్నాడు యశ్వంత్ .

మాటలు చెప్పటానికి ఏముంది ? మీరా విషయం లో ముదుర్లు .. ముందు మా పిల్ల ని ఏం చేసారో చెప్పండి ?

అన్నాడు భూపతి

ఆ విషయం చెప్పాల్సింది నువ్వు భూపతీ .. రాముడి చావు వెనుక నీ హస్త ముంది .. ఆ విషయం మాకు తెలుసు ..

ఇప్పుడు సరస్వతి కనబడకపోవటం వెనుక నీ హస్తమే ఉండి ఉంటుంది అన్నాడు శివ .

ఆపండి నోటికి ఏమొస్తే అది మాట్లాడకండి .. సరస్వతి ని పోలిస్ స్టేషన్ కి మీరే తీసుకు వెళ్ళింది .. అన్నాడు

బాలయ్య .

నిజమే .. కానీ సరస్వతి ని మేమే ఏమన్నా చేసామని సాక్ష్యముందా ? సరస్వతి ని తీసుకువెళ్ళింది ధాత్రి ,సత్య ..

వాళ్ళిద్దరూ ఆడపిల్లలు .. ఆ సమయం లో మేము ఊరిలోనే ఉన్నాము .. సరస్వతి వారితో బంధువుల ఇంటికి

వెళ్తానని చెప్పింది .. వారు నమ్మి వెల్లనిచ్చారు .. కానీ సరస్వతి మాయమైంది . కాదు మాయం చేసారు .. అది

ఎవరో తేల్చకుండా ఇక్కడ నుంచి కదిలేదే లేదు అన్నాడు యశ్వంత్ .

సామీ ఈళ్ళని అడుగుతూ కూకుంటే ఇల్లానే మాటాడతారు .. ఈళ్ల తప్పుకి శిక్ష ఏయండి అన్నాడు బాలయ్య .

భూపతి ఓ నవ్వు నవ్వి జనాన్ని చూసి .. చెప్పండి .. వీళ్ళు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా ? అని

అడిగాడు .


నమ్ముతున్నామయ్యా .. అన్నారు జనం .

అయితే వీరిని గ్రామం నుండి బహిష్కరిద్దాం .. మన ఆడపిల్లని మనకి సవ్యం గా అప్పగిస్తేనే శిక్ష రద్దు చేస్తాం ..

అంతవరకూ వీరికి మన గ్రామం లో తిరగటానికి గానీ ... తిండి అవసరాల కొనుగోల్లకి గానీ అనుమతించం ..

అన్నాడు భూపతి పెద్దగా ..

అమాయక జనం .. అంతే .. అంతే .. అని అరిచారు .

యశ్వంత్ , శివ కోపం గా చూశారు భూపతి వైపు ...

ఈ నియమం మీ ఇద్దరి స్నేహితులకి కూడా వర్తిస్తుంది .. అన్నాడు భూపతి .

"సరస్వతిని రచన తీసుకెళ్లిందని భూపతి కి తెలియదా .. ? శిక్ష నుంచి రచన కి ఎక్సెప్షన్ ఇచ్చాడు " అనుకున్నాడు

మనసులో యశ్వంత్ .

యశ్వంత్ ఏం చేద్దాం ? అన్నాడు శివ పళ్ళు కొరుకుతూ ..

మీ ఇష్టం .. మీరు మీ భూపతి నే నమ్మారు .. కానీ .. బట్ .. మేము మీ నిర్ణయాన్ని దిక్కరించం . ఈ క్షణం నుంచీ

మేము మీ ఊరి చివర ఉన్న రాణి మహాల్లోనే ఉంటాం .. నిజాల్ని మీ కళ్ళ ముందు నిలబెడతాం .. అన్నాడు

యశ్వంత్

ఇంకా ఉంది 








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: