Powered By Blogger

Thursday 22 May 2014

రుధిర సౌధం152

చెబుతాను తల్లీ .. చెప్పాల్సిన సమయమైతే ఆసన్నమయింది .. కానీ దానికి ముందు నీవు నన్నిక్కడ నుండి

విడిపించు .. లేదంటే వాడు మళ్ళి వస్తాడు .. నన్ను బంధించడం వెనుక వాడి ఉద్దేశ్యం కడు నీచమైనది .. అన్నాడు

బసవరాజు .

కానీ నేను నిన్నెలా విడిపించ గలను ? అంది సాలోచన గా రచన .

నీ చేతికి ఉన్న దారం మహత్తర మైనది .. అది నీకు రక్షా కవచం .. కానీ నేడు అదే నన్ను విడిపించగలదు .. నీ

చేతికి ఉన్న దారం తో నా చుట్టూ వలయకారం ఏర్పాటు చేయాలి . అప్పుడు దేవి రక్ష  నా చుట్టూ ఉన్న దుష్ట

వలయాన్ని చేధిస్తుంది .. అన్నాడు బసవరాజు .



ఈదారమా .. ? అని చేతి వైపు చూసింది .. అది మహర్షి రమణానంద ఇచ్చినది .. నాకు రక్షణ గా .. కానీ

ఆత్మార్పణ  కోసం వెళ్తున్న దానిని .. నాకింకేం రక్షణ అవసరమవుతుంది ? కనీసం ఈ బసవరాజు నైనా విడిపించిన

దానిని అవుతాను .. అనుకుంటూనే ఆమె మనసులో .. మరో ఆలోచన తళుక్కు మంది .. ఈ దారం ఈ వలయాన్ని

చేధించ గలిగితే సత్య చుట్టూ ఉన్న వలయాన్ని చేధించ గలదేమో .. అన్న ఆలోచన వచ్చింది ఆమెలో ..

ఆమె ఆలోచన గ్రహించి నట్టుగా .. నీ స్నేహితురాలు ఇంకా బలమైన వలయం లో బంధింప బడి ఉంది .. నువ్వు

ముందు నన్ను రక్షించడానికి ప్రయత్నించు .. నేను నీ స్నేహితురాలిని కాపాడే మార్గం తప్పనిసరిగా కనుగొంటాను

నామీద నమ్మక ముంచు .. అన్నాడు బసవరాజు ..

ఆమె ఆలోచన లో పడింది . " నా మరణం నా స్నేహితులని కాపాడుతుంది .. నా చేతిలో ఉన్న ఈదారం ఇతడ్ని

కాపాడుతుందని అంటున్నాడు .. విధి ఇదే నిర్ణయం తీసుకుని ఉండి ఉంటే అలాగే కానీ .. అని తన చేతికి ఉన్న

దారం మెల్లిగా విప్పి ఆ దారాన్ని బసవరాజు చుట్టూ వలయాకారం గా ఉంచింది .. తక్షణం ఆ దారం నుండి

మంటలు  ఉద్భవించి ఆ దారం మాయం అయింది .

అతడు గట్టిగా నవ్వాడు .. వైజయంతీ .. రా .. నీకు నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను .. అని గట్టిగా అరిచాడు

అతడు .

నిశ్చేష్టు రాలై .. బసవరాజు .. అంటే నువ్వు కూడా .. అంది రచన .

అతడు పెద్దగా నవ్వి .. అవును .. నేను కూడా .. వైజయంతి కి సహాయకుడిని .. నా మేనగోడలికి దక్కనిది

వేరొకరికి ఎలా దక్కనిస్తాను ? నాకు తెలుసు నీవు విధాత్రి అంశ తో జన్మించావని .. నిన్ను ఎదుర్కోవడానికి మోస

మే మార్గం .. అని వైజయంతీ రా .. అని గట్టిగా పిలిచాడు .

వైజయంతి నవ్వు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంది ..

రచన మోహంలో రక్తపు బొట్టు కూడా లేనంతగా పాలి పోయింది .. చుట్టూ భయంగా చూసింది ..

ఇంకా ఉంది  




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: