Powered By Blogger

Wednesday 21 May 2014

రుధిర సౌధం 151

రచన నిర్లిప్తం గా ముందుకి నడిచింది . ఆమె మనసులో కోటి సునామీలు వెల్లువై నట్టు . ఉంది . కళ్ళ ముందు

గిరిజ రూపం కదలాడింది.. తన తండ్రి ఆశ గుర్తుకువచ్చింది .

నన్ను  క్షమించండి నాన్నా .. నేను మీ కోరిక ని తీర్చలేకపోగా నేను నా జీవితాన్ని అంతం చేసుకోబోతున్నాను ..

మరేం చేయను ? సత్య ఈ నరకం అనుభవించలేక పోతోంది .. భరించలేక తను తనను తాను అంతం చేసుకుంటే

నేను నన్ను క్షమించకోలేను .. ఈ క్షణం నా లక్ష్యం కన్నా ఏ ఒక్కరి శాపనార్థాలు మన కుటుంబానికి తగల

కూడదని భావిస్తున్నాను . నా బాధ ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను .. మనసులో నే తండ్రికి

క్షమాపణలు చెప్పుకొంది . కన్నీరు ఆమె చెంప ని తడిపేస్తుంది . ..

యశ్వంత్ గుర్తుకువచ్చాడు ..


" రచనా .. నాకు చాలా ధైర్యం ఉంది .. కానీ ఎలాంటి మనిషైనా తన ప్రాణం లా భావించే వ్యక్తి ప్రమాదం లో

ఉన్నారంటే   ఆ ధైర్యం సనగిల్లిపోతుంది .. ఆ మాట నిజమని నీ విషయం లో నాకు అర్థమైంది .. నువ్వు ఇక్కడ కి

వచ్చావని తెలియగానే ఒక్కక్షణం కూడా నేను ముంబై లో ఉండలేకపోయాను .. " అన్న యశ్వంత్ మాటలు

గుర్తుకు వచ్చాయి .

ఈపాటికి యశ్వంత్ కి నేనేక్కడుంది తెలిసిపోయి ఉంటుంది .. మురారి చెప్పే ఉంటాడు .. నాకోసం తప్పనిసరిగా

ఇక్కడకి బయల్దేరి ఉంటాడు . కానీ దారిలో తనకెలాంటి సమస్య ఎదురైందో .. అయినా ఇది నాతొ మొదలైంది

నాతోనే అంతం కానీ .. అనుకొంది రచన .. ఆమె ముందుకి నడుస్తుంది ...

రచనా .. అన్న పిలుపు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది ఎందువల్ల నంటే ఆ స్వరం ఆమెకి సుపరిచితం గా

అనిపించింది .

కానీ ఆమె వెనుక ఉన్న వ్యక్తి ని చూసి ఆమె ఆశ్చర్యం తో ... బసవరాజు .. అంది ..

అవునమ్మా .. బసవరాజు నే .. ఈ పాడుబడ్డ కోట లో బందీ ని .. నన్ను విడిపించు తల్లీ .. అన్నాడు అతడు దీనంగా

ఆమె వైపు చూస్తూ ..

నువ్విక్కడ ? .. ఎలా ? అని అయోమయంగా అడిగింది రచన .

నన్ను ఓ మాంత్రికుడు బంధించాడు .. కానీ మీరే నన్ను విడిపించారు . ఆరోజు మీ చేతిలోని సీసా జారిపడ్డప్పుడు

బయటకి వచ్చిన నేను మళ్ళి వాడికే చిక్కాల్సి వచ్చింది . నన్ను వాడు ఈ కోట లో బంధించాడు .. దెయ్యాలతో

చెలగాటాలు ఆడేవాడు ఆ మాంత్రికుడు .. వాడు గీసిన రేఖ దాటి వెళ్ళలేక పోతున్నా తల్లీ .. అన్నాడు బసవరాజు .

అసలు నిన్ను ఎందుకు బంధించాడు వాడు ? అసలు ఎన్నోసార్లు ఎన్నో ప్రశ్నలు అడిగాను నిన్ను .. కానీ నువ్వు

ఏ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు .. కనీసం ఇప్పుడైనా చెప్పు ? ఎందుకు నిన్ను బంధించాడు ఆ వీరస్వామి ?

నీ ద్వారా వాడికి కలిగే లాభం ఏమిటి ? ఆవేశం గా అడిగింది రచన .

ఇంకా ఉంది 






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: