Powered By Blogger

Tuesday 27 May 2014

రుధిర సౌధం 156


వదలండి .. వదలండి ........ అంటూ పెనుగులాడుతోంది .. సరస్వతి ..

నోర్ముయ్ .. అని గట్టిగా అరిచాడు వీరాస్వామి .. ముందుకి సాగిన వాళ్ళ అడుగులు కోట దరికి చేరగానే ఆగి

పోయాయి ..

ఆమె ని గట్టిగా అదిమి పట్టుకొనే భయం భయం గా చూసాడు బాలయ్య . మిగతా ఇద్దరు కూడా ....

వీరస్వామి చుట్టూరా చూసి .. పదండి .. ఆగిపోయారేం ? నేనున్నా కదా .. అన్నాడు ముందుకి ఒక అడుగు వేసి ..

ఏంటో సామీ .. ఈ కోట చూస్తావుంటే భయంగానే ఉండాది .. దెయ్యాలంటే నాకు భయ్యం .. అన్నాడు బాలయ్య ..

బాలయ్య .. ఈ కోట లో బోలెడు దెయ్యాలున్నాయి .. నాకు మా తాత చెప్పాడు .. నాకు భయంగా ఉంది ..

వేరేక్కడన్నా ఉంచండి నన్ను .. ఇక్కడ  ఉంచ మాకండి .. పెనుగులాడుతూనే బ్రతిమలాడింది సరస్వతి ..

బాలయ్యా .. దాన్ని లోపలకి తీసుకు రా .. అని వీరస్వామి కోట లోపలికి నడిచాడు ..

భయంగానే సరస్వతి ని పట్టుకొని లోనికి నడిచారు వాళ్ళు ..

వీరా స్వామికి  .. కోట లో అడుగుపెట్టగానే ఒళ్ళు జలదరించింది ..

ఏమిటిది ? ఏదో వ్యత్యాసం కనబడుతోంది .. కోటలో .. ఏదో బలమైన శక్తి .. తిరుగాడుతున్న భావన .. ఏదో మంత్రం

ఉచ్చరించాడు .. కళ్ళు మూసుకొని .. వీరస్వామి .

మిగిలిన వాళ్ళు వీరస్వామి కేసి భయంగా చూస్తున్నారు ..

వీరస్వామి కళ్ళు తెరవగానే .. సరస్వతి .. గుడి ఎక్కడుందో .. నేను చెప్తాను స్వామీ .. నన్ను వదిలెయ్యి .. అంది

సరస్వతి ..

వీరస్వామి ఆమె వంక కళ్ళెర్ర జేసి చూసాడు .. తరువాత బాలయ్య వాళ్ళ వైపు చూసి .. దీన్ని ఆ దుంగ కి కట్టి

పడెయ్యండి .. అన్నాడు .. ఎదురుగా ఉన్న గది వైపు చూస్తూ ..

హా.. అని ఆమె ని ఆ గదిలోకి తీసుకు వెళ్ళిన వాళ్ళు .. అక్కడ నేల పైన అచేతనం గా పడున్న ధాత్రి ని చూసి

గట్టిగా అరిచారు ..

సరస్వతి కంగారుగా ధాత్రమ్మా .. అని అరిచింది ..

ఆ అరుపుకి దీనం గా కళ్ళు తెరచి చూసింది ధాత్రి (రచన ).

బాలయ్య ఆమె ని అలా చూసి .. తత్తరపడ్డాడు .. వీరాస్వామి ఇటు ఓ సారి రా .. అన్నాడు ..

అప్పుటికే అక్కడికి వచ్చిన వీరాస్వామి .. ఇక్కడ ఈమె ఉన్నదేంటి ? అన్నాడు అయోమయంగా ..

నోటివెంట మాట .. శరీరం సహరించక పోవడం తో దీనంగా వారివైపు చూడటం తప్ప వేరేం చేయలేకపోయింది రచన

ఆమె ఉన్న స్థితి ని చూసి .. ఆశ్చర్యపోయాడు .. ఈ కట్టు బసవరాజు మాత్రమె వేయగలడు .. అంటే నానుండి

తప్పించుకున్న ఆ బసవన్న .. ఈమె ని ఎందుకు బంధించాడు ? అంటే బసవడి ఆత్మ ఇక్కడనే ఉంది ..

దొరికినావు  బసవన్నా .. మళ్ళి నాకు దొరికినావు .. అనుకున్నాడు మనసులో వీరస్వామి ..

వీరస్వామి .. ఈ పిల్ల ఇక్కడున్నది .. ఏన్దంటావు ? ఏమి జరిగుంటాది? ఆందోళన గా అన్నాడు బాలయ్య ..

ఈ పిల్ల మీద ఆ బసవరాజు గాడి కట్టు ఉన్నది బాలయ్య .. వాడే ఈ విధం గా సేయగలడు .. అన్నాడు వీరస్వామి

చుట్ట పీలుస్తూ  .

ఇంకా ఉంది  








మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: