ఏంటి ? మళ్ళి మమ్మల్ని అందర్నీ భూపతి ఇంటి ముందుకి రమ్మన్నావు ? ఏంటి విషయం ? అడిగాడు భూపతి
ఇంటి ముందర నిలబడ్డ జనం లోంచి ఒకడు .
కొద్దిసేపు ఓపిక పట్టన్డయ్యా .. కళ్ళ ముందు కమ్మిన మబ్బులు విడిపోతాయి .. అన్నాడు తాత .
ఏమిటయ్యా ... అందరూ ఇలా కట్ట కట్టుకొని మరీ వచ్చారు ? భూపతి గారితో ఏం మాట్లాడాలని ? అన్నాడు
అప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చిన గుమస్తా శంకరం ...
నేనే రమ్మన్నాను శంకరం గారూ .. అన్నాడు యశ్వంత్ అక్కడికి చేరుకుంటూనే ...
శంకరం తో పాటూ జనం కూడా ఆశ్చర్యంగా చూసారు యశ్వంత్ వైపు .. శివ వైపు ..
నువ్వా ? ఎంత ధైర్యం మిమ్మల్ని ఊరినుంచి వేలివేసాం ... మర్చిపోయారా ? అన్నాడు శంకరం కళ్ళద్దాలను సరి
చేసుకుంటూ ..
మర్చిపోలేదు శంకరం గారూ .. అందుకే వచ్చాం .. ముందు ఈ ఊరి దేవుడిని .. అదే మీ భూపతి గార్ని ఓసారి
పిలవండి ... అన్నాడు శివ వెటకారంగా ..
పిలుస్తాం .. ఎందుకు పిలవం ? అని లోపలికి వెళ్ళాడు శంకరం ..
ఏంటయ్యా ? మళ్ళి ఈ పంచాయితీ ... మిమ్మల్ని ఊరినుండి పంపేసాం .. మళ్ళి మళ్ళి ఇలా మీరు ఊరిలోకి
వస్తే ఎలా ? అన్నాడు ఓ పెద్దమనిషి జనం లోంచి .
నిజమే .. కానీ మేము నేరం చేశామని ఒప్పుకోలేదు కదా ... మామీద ఓ నింద ని మోపారు .. అది నిజమా కాదా
అన్నది మీకు తెలియాలి కదా .. భూపతి ని రానివ్వండి .. అన్ని మీకే తెలుస్తాయి .. అన్నాడు యశ్వంత్ .
అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..
ఇంతలో లోపలికి వెళ్ళిన శంకరం ... అయ్యా .. మీరోసారి బయటకి రావాలయ్యా .. అన్నాడు భూపతిని .
ఏం శంకరం ? బయట ఏదో కోలాహలం గా ఉంది ఏం జరిగింది ? అన్నాడు భూపతి .
ఆ పట్నం వాళ్ళు వచ్చారయ్య .. మిమ్మల్ని పిలుస్తున్నారు ... అన్నాడు శంకరం నసిగినట్టుగా ..
వాళ్ళా ? ఎందుకు వచ్చారు ? పద .. వెధవల్ని కడిగిపాడేస్తాను ... అని బయటకి నడిచిన భూపతి ఇంటి ముందు
గుమిగూడిన జనాన్ని చూసి హతాసుడైనాడు ...
వెల్కమ్ భూపతి గారూ .. మీకోసమే వేచి చూస్తున్నాం .. అన్నాడు యశ్వంత్ చిరునవ్వుతో ...
ఏమిటిది ? అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి ? గద్దించి నట్టు అన్నాడు భూపతి ..
నిన్న మీరు మాకు సర్ ప్రైస్ చేశారు .. ఈరోజు మేము మీకు చేస్తున్నాం .. అంతకి మించి ఏం లేదు భూపతీ ..
అన్నాడు శివ .
ఓయ్ .. మర్యాద .. మర్యాదగా మాట్లాడు .. నువ్వు మా ఊరిలో నిలబడి మాట్లాడు తున్నావు అది మర్చి పోకు ..
అన్నాడు భూపతి కోపంగా .
నిజమే .. మర్యాద ఇచ్చిపుచ్చు కోవాలి ... కానీ ఈ సూత్రం నీలాంటి మేక వన్నె పులుల దగ్గర వర్తించదు భూపతీ ..
అయినా ఆలస్యం చేయకూడదు .. నీ భండారం బయట పెట్టడానికి ... ఎందుకంటే ఇక్కడి వచ్చిన ప్రజలు వాళ్ళ
పనులు మానుకొని వచ్చారు గా ... అన్నాడు యశ్వంత్ .
ఏం మాట్లాడుతున్నారు ? మీరు బయట పెట్టడానికి ఏముందని ? అన్నాడు భూపతి ... కోపంగా
ఉంది భూపతీ .. సరస్వతి .. సరస్వతి కనిపించడం లేదనేగా .. మామీద నింద మోపావు .. ఆ సరస్వతి ని నువ్వే
కిడ్నాప్ చేసావు .. అది నిజం .. ఒప్పుకోక తప్పదు .. అన్నాడు శివ .
పిచ్చి పట్టిందా మీకు ? నేనెందుకు సరస్వతి ని ఇబ్బంది పెడతాను ? మీ పిచ్చి వాగుడిని మా జనం నమ్మరు ..
అన్నాడు భూపతి ..
ఎందుకు నమ్మరు ? నువ్వు చూపించిన సాక్ష్యాలను నమ్మిన ఈ ప్రజలు .. నిజాలని నమ్మరా ? నమ్ముతారు ..
అన్నాడు యశ్వంత్ .
భూపతి గార్ని అంటారేంటి ? ఆయన్ని అలా అనడానికి మీ దగ్గరేం సాక్ష్యం ఉంది ? అన్నాడు జనం లోంచి ఒకడు .
సరస్వతి ... సరస్వతే .. ఉంది .. సాక్ష్యం గా ... అన్న మాటలు విని అందరూ తల పక్కకి తిప్పి చూశారు ..
అక్కడ రచన , సరస్వతి ఇద్దరూ నిలబడి ఉన్నారు ..
అరె .. మన సరస్వతే .. అని జనం అనుకుంటే .. సరస్వతి ని చూసి ... హతాశుడయ్యాడు భూపతి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
1 comment:
Kadha chakkaga sagutondi. Climax daggara padutondi anagane okko issue clear chesukuntu vastunnaru. Chalaa bagundandi.
Post a Comment