రుధిర సౌధం
గురువుగారూ ... ఇంకా ఎంత సేపు మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది ? అడిగాడు గోపాలస్వామి
ముకుళిత వదనం తో అతడి వైపు చూసి .. ఏమి నాయనా ? కాళ్ళు నొప్పి పెడుతున్నాయా ? అన్నారు
రమనానంద మహర్షి .
అయ్యో .. లేదు స్వామీజీ ... మీరు అవిశ్రాంతం గా నడక సాగిస్తూనే ఉన్నారు ... మీరు కొంచెం విశ్రమిస్తే బావుండు
నని ... అన్నాడు గోపాలస్వామి ..
దగ్గరలోనే ఓ నది ఉంది ... ఒక బోయవాడు మనకోసమే ఎదురుచూస్తూ ఉంటాడు .. అతనిని పడవని సిద్ధం
చేయమని చెప్పు గోపాలస్వామి . నేనింతలోపు అక్కడికి చేరుకుంటాను .. నువ్వు వడివడిగా అక్కడకి వెళ్ళు ..
అన్నారు మహర్షి .
తమరి ఆజ్ఞ .. అని గోపాలస్వామి పక్షుల కిలకిలారావాల ననుసరించి అటుగా సాగిపోయాడు ...
తిరిగి నడక నారంభించాడు రమనానంద మహర్షి .
********************************
ధాత్రమ్మా .. నేను సిద్ధం గా ఉన్నాను .. కానీ నేను , తాత , మీరు ముగ్గురం అక్కడికి వెళ్ళిపోతే సత్యమ్మ ని
ఎవరు చూసుకుంటారు ? అంది సరస్వతి .
రచన సమాధానం చెప్పబోయే లోపే తలుపు కొట్టిన చప్పుడు వినిపించి ... పద .. తలుపు తీద్దాం .. అంది రచన
సరస్వతి వెళ్లి తలుపు తీసింది ... ఎదురుగా మురారి .
బాబూ మీరా ? అంది సంతోషం గా సరస్వతి ...
మురారీ ... అంది రచన .
రచనా .. అంటూ వచ్చి ఆమె చేయి పట్టుకొని .. నిన్ను మళ్ళి నేను చూడగలుగుతున్నాను .. ఐ అమ్ వేరి
హ్యాపీ .. అన్నాడు మురారి ..
రచన ... ధాత్రమ్మ పేరు రచనా ? అంది ఆశ్చర్యంగా సరస్వతి ...
రచన చిన్నగా నవ్వి మురారీ .. సంతోషం లో సరస్వతి నా పేరు చెప్పేసావా ? అని సరస్వతి వైపు తిరిగి ..
నువ్వు నన్ను ధాత్రమ్మా .. అని పిలువు సరస్వతీ .. అందులో ఏదో తెలియని ఆత్మీయత ఉంది .. అంది రచన .
సరస్వతి ఆమె వంక నవ్వుతూ చూసింది ..
రా రా ... మురారీ .. సత్య ని నీకు అప్పజెబుతా నన్నాను గా .. తను లోపల నిద్రపోతోంది .. అంది రచన .
ఆమె తో పాటు ఆత్రుత గా ముందుకి నడిచాడు మురారి .
మంచం మీద జీవచ్చవం లా పడున్న సత్యని చూసి అమాంతంగా ముందుకి పరుగుతీసి ఆమె దగ్గరకి చేరాడు ..
సత్యా .. సత్యా .. చూడు .. నీ మురారి ని వచ్చాను .. అన్నాడు సుడులు తిరుగుతున్న కన్నీటిని అణచుకుంటూ .
మురారీ .. సత్య మామూలు మనిషి కావటానికి మనందరి ప్రేమా తనకవసరం .. అంది రచన .
చిన్నగా తల ఊపి .. అవును .. అని .... రచనా... యశ్వంత్ ,శివ భూపతి ఇంటి వైపు వెళ్ళారు .. నేను సత్యని
చూసుకుంటాను .. నువ్వు , సరస్వతి వెళ్ళిరండి .. అన్నాడు మురారి .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments:
Post a Comment