ఇప్పుడు చెప్పు .. అసలేం జరిగింది ఆ పాడుబడ్డ కోటలో ... అన్నాడు మెట్ల మీద తీరిగ్గా , ప్రశాంతం గా కూర్చున్న
ప్రేయసి పక్కన కూర్చుంటూ ..
నేనక్కడికి వెళ్లానని తెలియగానే నువ్వు నా కోసం వచ్చావ్ కదూ .. అంది రచన అతడి కళ్ళలోకి ప్రేమగా చూస్తూ .
ఆమె అలా అడగగానే కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి .. లేదు .. నీకొసమైతె రాలేదు .. అన్నాడు యశ్వంత్ .
అమాయకం గా మొహం పెట్టి తానూ లేచి నిలుచుని .. నాకు నమ్మకం నీ మీద .. నువ్వు సాధించుకు రా గలవని .
అందుకే నేను రాలేదు .. బట్ సరస్వతి ని బాలయ్య వాళ్ళు అటువైపే తీసుకురావడం చూసి ఫాల్లో అయ్యాం అంతే .
అన్నాడు యశ్వంత్ .
అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ? అంది బుంగమూతి పెట్టి రచన ...
ఇప్పుడెందుకు వచ్చిందా అనుమానం ? అన్నాడు కొంటె గా నవ్వుతు యశ్వంత్ .
మరి .. ప్రేమించిన అమ్మాయి అలాంటి చోటికి వెళ్తే ఏమయ్యుంటుందో అన్న టెన్షన్ కూడా లేదా నీకు ? అంది
నిలదీస్తున్నట్లుగా రచన .
హ్ .. అని నిట్టూర్చి .. పాపం .. మా రచన అక్కడికి వెళ్తోంది .. అక్కడ ప్రశాంతం గా ఉన్న దెయ్యాలకి దిక్కూ , గతి
లేకుండా పోతోందే అని భయ పడ్డాను సుమీ .. అన్నాడు యశ్వంత్ తమాషాగా .
నిన్నూ ... అని అతడి ముక్కు మీద ఒక్క పిడి గుద్దు గుద్దింది రచన .
అతడు .. కమాన్ .. వుయ్ విల్ ఫైట్ .. అని చేతులు బిగించి ముందుకి వచ్చాడు ..
హే .. హే .. ఏం చేస్తున్నార్రా బాబూ .. అంటూ వచ్చాడు శివ .
ఫైటింగ్ అన్నారు .. ఇద్దరూ ఒకేసారి .
ఓహ్ .. అయితే .. తర్వాత .. అని రచన వైపు తిరిగి .. రచనా .. కొంతమంది ఆడవాళ్ళు మహల్ శుభ్రం చేసేందుకు
వచ్చారు .. మగవాళ్ళంతా బయట అంతటా శుభ్రం చేస్తున్నారు .. అన్నాడు శివ .
ఆడవాళ్ళా ? స్ట్రేంజ్ .. నిన్నటి వరకూ ఇటు వైపు రావటానికే భయపడ్డారు .. ఇప్పుడు ఇంత మంది ధైర్యం గా
వస్తున్నారు . ఒక్కసారి గా కాలం ఎంత మాయ చేసిందో .. అంది రచన అబ్బురం గా .
అవును .. ఇలా మహల్ చుట్టూ అందరూ ధైర్యంగా తిరగాలనేగా నువ్వు తపన పడ్డావు . నువ్వు అనుకున్నది
ఈరోజు జరుగుతుంది రచనా .. అన్నాడు యశ్వంత్ .
అవును యశ్ .. అని శివ వైపు తిరిగి ఇంతకీ వాల్లెక్కడున్నారు ? అంది రచన .
అటువైపు మండపం మెట్ల మీద .. చాలా కులాసా గా కూర్చున్నారు . వాళ్ళ మొహాల్లో నిశ్చింత , ధైర్యం కాన
వస్తుంది . అటువైపు చూడు .. అన్నాడు శివ .
శివ చూపించిన వైపు చూసారు ఇద్దరూ ..
వాళ్లకి పని అప్పచెప్పి వస్తాను అయితే అని రచన కదల బోతుంటే ... రచనా .. ఆగు .. ముందు అన్ని విషయాలు
మనం మాట్లాడుకోవాలి కదా .. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి మా మనస్సులో .. అన్నాడు యశ్ .
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది
2 comments:
Too much meeru mari suspense pettestunnaru .. Intha takkuva rayadam.. Asalu vaijayanti em chestundo ani ikkada tension .. Konchem pedda posts rayandi please
Mee peru raayaledu. Anyways anta interest ga "rudhira soudham" chaduvutunnanduku santosham
Naakunna samayam aa matram raayatanike saripotundatam to ante raastunnaanandi. Let me try to extend. Thank you
Post a Comment