Powered By Blogger

Wednesday 16 July 2014

రుధిర సౌధం 197

 అయ్యా ... లేవండయ్యా .. ఉదయం నుంచీ అలానే కూర్చుని ఉండిపోయారు .. అబ్బాయి గారి సంగతి తెలియడం

లేదయ్యా .. ఎక్కడికి వెళ్ళారో ఏమో .. అన్నాడు బాధగా గుమస్తా శంకరం .

శంకరం వైపు నిర్లిప్తం గా చూశాడు భూపతి .. ఆ కళ్ళ లో అంతులేని శూన్యం ..

ఏం శంకరం ? నువ్వు మాత్రం నాతొ ఉన్నావెం ? నన్ను విడిచి అందరూ పోయారే .. ఒక్కసారిగా ఈ భూపతి

సామ్రాజ్యం సర్వనాశన మై పోయింది . ఆ పట్నం కుర్రాళ్ళు నా నోటిలో మట్టి గడ్డలనుకున్నాను.. కానీ .. కానీ .. ఆ

పిల్ల ...  ఆ  పిల్ల ఇంత పని చేస్తుందనుకోలేదు ... ఆ పిల్ల రాచ కుటుంబం మనిషి అని తెలుసుంటే పరిస్థితి ఇలా

ఉండి  ఉండేదే కాదు .. అన్నాడు నీరసంగా భూపతి .

 అవును .. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మీకు వ్యతిరేకం గా ఉన్నాయి కదయ్యా .. మనం ఈ ఇల్లు ఖాళీ

చేయాల్సిన పరిస్థితి .. అన్నాడు శంకరం మెల్లిగా .

లేదు .. శంకరం .. ఈ బంగ్లా రాచ కుటుంబానిదే అయ్యుండొచ్చు .. కానీ నా జీవితమంతా ఇందులోనే గడచింది .

ఇప్పుడు నా ప్రాణం కూడా .. ఇందులోనే .. అయినా రత్నానికి ఏమివ్వనయ్యా ? అన్నాడు దాదాపుగా ఏడుస్తూ

భూపతి .

ఆ స్థితి లో భూపతిని చూసి జాలేసింది    శంకర0 కి .

అయ్యా .. నేనోసారి ఆ మహల్ వరకు వెళ్లి మనకి కొంత సమయం కావాలని అడిగి వస్తానయ్యా .. మీరున్న స్థితి

లో  ఉన్నట్టుండి ఎక్కడ కి పోతారయ్య ? అన్నాడు శంకరం .

దూరంగా నిలబడి వీరి సంభాషణ అంతా మౌనం గా వింటున్న వెంగమ్మ భూపతి ఏం చెబుతాడా అన్నట్లు

చూసింది.

భూపతి కూర్చున్న చోటి నుండి లేచి ... అసలు ఆ పిల్ల వారసురాలని నమ్మక మేంటి ? మనం ఎందుకు ఖాళీ

చేయాలే   ? అన్నాడు తెచ్చి పెట్టుకున్న ధైర్యం తో .

అయ్యా .. ఈ స్థితి లో కూడా .. ఏంటయ్యా ? ఇప్పుడు ఊరు ఊరు అంత వారి వైపే ఉందయ్యా .. మనకి బలం లేదు

కదయ్యా .. ఇప్పుడిలాంటి మాటలు అంటే మనకే ముప్పు .. చిన్ననాటి నుండి మీ ఉప్పు తిన్న మూలాన

మిమ్మల్ని వదల్లేక నేను , ఆ వెంగమ్మ ఇంకా మీతోనే ఉండి పోయాం గానీ .. లేదంటే ఊరి వాళ్ళు అంతా

మిమ్మల్ని  వెలివేశారు గనుక మా దారి మేము జూసుకోమా ? అన్నాడు శంకరం .

భూపతి మళ్ళి  నిస్తేజ0 గా కుర్చీ లో కూల బడ్డాడు ...

దయజేసి నా మాట మన్నించండి తమరు ... నేను వెళ్లి వాళ్ళని అర్థిస్తాను .. కొంత సమయం గావాలని ..

అన్నాడు  శంకరం .

భూపతి మౌనం గా ఉండిపోయాడు ..

అతడేం సమాధానం చెప్పక పోయే సరికి అయోమయం గా వెంగమ్మ వైపు చూశాడు శంకరం .

వెంగమ్మ భూపతి వంక అసహనం గా చూసి ... శంకరాన్ని వేల్లమన్నట్టు సైగ చేసింది ..

అలాగే నంటూ తల ఊపి అక్కడ్నించి కదిలాడు శంకరం .

                                          **********************************

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: