Powered By Blogger

Friday 18 July 2014

రుధిర సౌధం 199 .


శంకరం నీళ్ళు నమిలాడు ..

చెప్పండి ఫర్వాలేదు .. మీరేం చెప్పదలచుకున్నారు ? అన్నాడు యశ్వంత్ కాస్త కూల్ గా ..

అయ్యా .. మనిషి నీరుగారిపోయాడు .. బిడ్డ ఇంతవరకు అగుపడలేదు .. కాస్త సమయం ఇవ్వండయ్య .. బంగ్లా

ఖాళీ చేసేందుకు .. అన్నాడు శంకరం .

ఏంటీ .. ఇంతవరకు రత్నం రాజు ఇల్లు చేరలేదా ? అసలేక్కడికి వెళ్ళాడు ? అన్నాడు కంగారుగా యశ్వంత్ .

ఏమో తెలవదయ్య .. మాట మాత్రం కూడా చెప్పలేదు .. పక్కూరికి కూడా వెళ్ళాలంటే తండ్రికి చెబుతాడు ..

ఇప్పుడేమయ్యాడో .. ఏడున్నాడో తెలవదయ్య .. అన్నాడు శంకరం ..

అవునా ? అని వెంటనే .. బాలయ్యా .. బాలయ్యా .. అని  అరిచాడు యశ్వంత్ .

ఎక్కడున్నాడో గానీ పరుగున   వచ్చిన బాలయ్య .. శంకరం వైపు ఏంటా అన్నట్లు చూసి .. యశ్వంత్ వైపు తిరిగి

చెప్పండయ్య .. అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు ..

నువ్వే మా కొంప ముంచావు గదరా .. అన్నట్లు మింగేసేలా చూశాడు శంకరం బాలయ్య వైపు .

బాలయ్యా .. రత్నం రాజు ఉదయం నుండి కనబడలేదంట . నువ్వు గ్రామస్తులన్దర్నీ ఓ సారి అడుగు .. ఎవరైనా

తనని చుసారేమో .. లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడైన చూసారేమో .. వెంటనే వెళ్ళు .. అన్నాడు యశ్వంత్ .

అలాగే నయ్యా .. అని అక్కడ్నించి కదిలాడు బాలయ్య .

శంకరం యశ్వంత్ వైపు ఆశ్చర్యంగా చూశాడు ..

ఏంటలా చూస్తున్నారు ? భూపతి కొడుకు కోసం మేమెందుకు తాపత్రయ పడుతున్నామనా ? తప్పు అతడు చేయ

లేదు కదా.. భూపతే కదా తప్పు చేసింది ... అన్నాడు శివ .

శంకరం గారూ .. రత్నం జాడ తెలిసే వరకూ భూపతి ఆ బంగ్లా లోనే ఉండొచ్చు .. మీరిక వెళ్ళండి అన్నాడు

యశ్వంత్ .

నిజంగా మీరు మంచి మనుషులయ్య .. శత్రువు మీద కూడా దయజుాపించారు .. మీ ఋణం తీర్చుకోలేమయ్య ..

అన్నడు శంకరం .

ఉం .. అని తలూపి .. పద శివా మనం ఇక వెళ్దాం .. అని శివ భుజం మీద చేయి వేసి ముందుకి సాగిపోయాడు యశ్

వీళ్ళు కూడా రత్నం బాబు కోసం ఇంత ఆందోళన పడ్డారంటే నేను అనుమానించినట్టు రత్నం బాబు వీళ్ళ దగ్గర

లేడు.. రత్నం బాబు ని వీళ్ళే దాచేసి భూపతి ని ఇంకా ఏడిపిస్తున్నా రనుకున్నా .. కానీ కాదు .. మరి ఏమయి

ఉంటాడు రత్నం బాబు ? తెల్లారిందగ్గర్నుండి అయిపు లేడే .. ఇదైతే కొంచెం ఆలోచించాల్సిన విషయమే ..

అనుకుంటూ  .. మహల్ వైపు చూశాడు ..

జనం ఇంకా పనిలో నిమగ్నమై ఉన్నారు ..

వోర్నీ .. అప్పుడే ఈ దెయ్యాల కోటని ఇలా ఎలా మార్చేసినారు ? ఈళ్ళు భూపతినే కాదు దెయ్యాలని కూడా కోట

ఖాళీ చేయిన్చినట్టున్నారు .. అనుకుంటూనే బంగ్లా వైపు నడక సాగించాడు శంకరం .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

2 comments:

Karthik said...

:-):-)

రాధిక said...

Whts the meaning of these smiles kartik ji?