Powered By Blogger

Monday 21 July 2014

రుధిర సౌధం 201




రావణపురం కూరగాయల వ్యాపారం జరిగే స్థలం .. రైతులు , చేతి వృత్తుల వారు తమ తమ సామాన్లు విక్రయించే

స్థలం అది .

ప్రజలు ఆనందం గా పాటలు పాడుతున్నారు . ఆ పాటలు హుషారుగా డాన్సు చేస్తున్నాడు శివ .. యశ్వంత్

చప్పట్లు కొడుతూ అతడిని ఉత్సాహ పరుస్తున్నాడు .

యశ్ .. యశ్ .. గట్టిగా అరచింది రచన .

గిరుక్కున వెనక్కి చూసి .. హే ..

నువ్వెప్పుడొ చ్చావు ? సర్లే ..

సమయానికి వచ్చావు .. రా.. రా .. ఈ

ఊరికి మంచి  రోజులు రాబోతున్నాయని ప్రజలంతా ఎంత ఉత్సాహం గా ఉన్నారో చూడు .. మన శివ చూడు .. ఎలా

గెంతులేస్తున్నాడో .. అన్నాడు హుషారుగా యశ్వంత్ ఓ వంక శివ ని చూస్తూ ..

ఆ .. అంది నీరసంగా రచన .

అరె .. ఏమైంది ? ఎందుకలా ఉన్నావు ? అడిగాడు యశ్వంత్ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ .

యశ్ .. బాలయ్య వచ్చాడు .. అంటూ .. బాలయ్య చెప్పిన విషయం అంతా యశ్వంత్ చెవిన పడేసింది రచన .

ఓహ్ .. అని తల పట్టుకున్నాడు .. యశ్వంత్ .

మనం ఈ విషయం భూపతి కి చెబుదామా ?  అంది రచన .

అమ్మాయి గారూ .. అన్న మాట విని పక్కకి తిరిగి చూశారు ఇద్దరూ .. గుమస్తా శంకరం ఉన్నాడు అక్కడ .

అతడిని అక్కడ చూడగానే .. యష్ , రచన ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని .. రా రచనా .. అని శంకరం

వైపు నడిచాడు యశ్వంత్ .

మీరు .. ఈ మార్కెట్టు కి వచ్చారా ? అన్నాడు శంకరం .

శంకరం గారు ఆ విషయం పక్కన పెట్టండి .. అని రత్నం విష్యం చెప్పారు శంకరానికి.

అయ్యా .. ఎంత ఘోరం ? ఇది వింటే భూపతి తట్టుకోలేడు .. అన్నాడు శంకరం .

అసలు రత్నం ఎక్కడికి వెళ్ళుంటాడు చెప్పగలరా మీరు ? అమాయకంగా అడిగింది రచన .

ఇంకెక్కడికి అమ్మా .. మీరు ప్రమాదం లో ఉన్నారనుకొని ఏమీ ఆలోచించకుండా ఆ కోటకే వెళ్లి పోయుంటాడు ...

ఇంతవరకు తిరిగిరాలేదు .. అంటే .. ఏమైపోయాడో కుర్రాడు అన్నాడు శంకరం బాధగా .

లేదు శంకరం గారూ .. రత్నం చాలా పిరికివాడు .. అంతవరకూ ఎలా వెళ్తాడు ? నేను బాలయ్య కి వెదకమని

పంపాను .. ఐనా నేను ప్రమాదం లో ఉన్నననుకొని అతడు రావడమేంటి ? నాకర్థం కాలేదు .. అంది రచన .

రత్నం బాబు నిన్ను ఇష్టపడ్డాడమ్మా .. ఇష్టపడినోడు ప్రాణం అనుకున్న పిల్ల కోసం ఏమైనా చేస్తాడమ్మా .. అన్నాడు

శంకరం బాధగా .

వ్వాట్ .. రత్నం రాజు నన్ను ఇష్ట పడ్డాడా ? ఏం మాట్లాడుతున్నారు మీరు ? అతడి ఇష్టా ఇష్టాలు ప్రాణత్యాగం

చేసేంత  గొప్పవి కావని మీకు తెలీదా ? కోపంగా అంది రచన .

మౌనంగా ఉండిపోయాడు యశ్వంత్ .

లేదమ్మా ? ఆ బాబు చెడు తిరుగుళ్ళు తిరిగిన మాట నిజమే .. నీ మీద అలాంటి ఇష్టమే ఉందను కొన్నాం .. కానీ

రత్నం బాబు వాల్లయ్య తో చెప్పాడు .. ధాత్రి ని నేను ప్రేమిస్తున్నాను .. తను లేకుండా ఉండలేను .. అని .. భూపతి

గారు కూడా రేపో మాపో మీతో ఈ విషయం ప్రస్తావించేవారు కూడా .. కానీ ఈ లోపే .. ఏవేవో జరిగి పోయాయి ..

నేను చెప్పేది నిజమమ్మా .. అన్నాడు శంకరం .

నో .. అని కన్నీళ్ళ పర్యంత మయింది రచన .

ఇంకా ఉంది









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: