Powered By Blogger

Monday 28 July 2014

రుధిర సౌధం 206

సత్య ని ముంబై లో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తే బావుంటుంది శివా ? సాలోచన గా అడిగాడు మురారి .

డాక్టర్ లు నయం చేయగలరంటావా మురారీ ? ఇలాంటి సమస్యలు మన సైన్స్ లో కొత్త పేర్లు పెట్టుకోడానికే..

ఆయుర్వేద చికిత్స అయితే బెటర్ అని పిస్తుంది .. అన్నాడు శివ .

తను ఇక్కడ కి రాకుండా ముంబై లోనే ఉండుంటే బావుండేది శివా .. నన్నొదిలి ఉండలేక వచ్చేసింది .. అని

ఇంకేదో మురారీ చెప్పబోతుండగా ..

మురారీ .. యశ్ , రచన వస్తున్నారు .. అన్నాడు శివ మహల్ ద్వారం వైపు చూస్తూ ..

వెనక్కి తిరిగి .. వాళ్ళని చూసి .. చిరునవ్వు తో హౌ ఆర్ యు రచనా .. అన్నాడు మురారి .



మురారి వైపు చిరునవ్వుతో చూసి .. అదేంటి అలా అడుగుతున్నావు ? ఉదయమే కదా మనం కలిసింది .. అంది

రచన అక్కడ ఉన్న చైర్ లో తానూ కూర్చుంటూ .. యశ్వంత్ కూడా ఆమె పక్కన కూర్చున్నాడు ..

నువ్వు డల్ గా ఉన్నావని తెలిసింది లే .. అందుకే .. బట్ నువ్విప్పుడు నాకు డల్ గా కనిపించటం లేదు ..

అన్నాడు మురారి .

సత్య ఎలా ఉంది ? ఏమైనా తిన్నదా లేదా ? అయినా తననిక్కడ కి తీసుకోచ్చేయాల్సింది మురారీ .. నేను మనం

ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను ఇక్కడ .. అంది రచన .

రచనా .. తనని అక్కడనుంచి కదప బుద్ధి కాలేదు .. సరస్వతి తనని ఎంతో బాగా చూసుకుంటుంది .. అందుకే

నేను అక్కడే ఉంచేసి వచ్చా .. మనం ఏదో పనిలో ఉండాల్సి వస్తుంది ఇక్కడ .. తనని చూసుకోవటం కుదరక

పోవొచ్చు కదా .. అన్నాడు మురారి .

నువ్వన్నది నిజమే .. తానిప్పుడు అక్కడ ఉండటమే బెటర్ లే .. అంది రచన బాధగా .

నువ్వు చెప్పు రచనా .. అసలు .. అసలు సత్య పరిస్థితి ఏంటి ? నాకేం అర్థం కావటం లేదు .. అన్నాడు మురారి .

శివ , యశ్వంత్ లు.. ఇద్దరూ కూడా ఆమె వైపు ఆసక్తిగా చూశారు .

ఆమె మెల్లిగా లేచి చిన్నగా నిట్టూర్చి .. నేను కోట చేరుకునే సరికి సత్య వైజయంతి గీసిన భూత రేఖ లో

బంధింపబడి ఉంది .. నేను ఆమె ని సమీపించ లేక పోయాను .. మురారీ .. కానీ దైవం మన వైపు ఉండటమో

ఏమో సమయానికి అనుకోకుండా అక్కడికి వీరాస్వామి రావటం అతను మనకి సహాయం చేయటం జరిగింది ..

అతను సత్య ని ఆ వలయం నుండి కాపాడాడు .. కానీ తనని పూర్తిగా నయం చేయలేనని చెప్పాడు .. సత్య

కి నయం కావాలంటే దివ్య శక్తులు ఉండాలన్నాడు .. ఓ పుణ్య పురుషుడై ఉండాలన్నాడు .. కానీ అటువంటి

వారు ఎవరు .. ఏమిటి అన్నదే మనం ఆలోచించాలి .. ఆ దివ్య పురుషుడు ఎవరై ఉంటారో .. అంటూ గేటు వైపు

చూసిన ఆమె ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి చేసి చూసింది ..

రచన అలా సడన్ గా మాట్లాడుతూ ఆగిపోవటం చూసి ఆమె వైపు చూసిన ఆ ముగ్గురు స్నేహితులు ఆమె

కళ్ళలో   ఆశ్చర్యాన్ని గమనించి ఆమె చూస్తున్న వైపు చూశారు ..

స్వా మీ.. జీ ...    అసంకల్పితం గా రచన పెదవులు ఉచ్చారించాయి ..

ఈయన .. రమనానంద మహర్షి .. ఇక్కడ .. ఆశ్చర్యం గా ఉందే .. అన్నాడు యశ్వంత్ ..

ఆయన ఎవరో మీకు తెలుసా ? అడిగాడు మురారి ఆయన ముఖ వర్చస్సు కి ఆశ్చర్య పడుతూ ..

ఇంతలో అమాంతంగా పరుగుతీసి అతడిని చేరుకొని అతడి పాదాలపై పడి నమస్కరిoచింది రచన .

ఇంకా ఉంది







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: