Powered By Blogger

Tuesday 29 July 2014

రుధిర సౌధం 207

లే తల్లీ .. అని ఆప్యాయంగా ఆమె ని లేవదీసారు స్వామీజీ .

నాకిప్పుడు అర్థం అవుతుంది .. భగవంతుడి లీల ఎలా ఉంటుందో .. నా మనసు లో అనుకుంటూనే ఉన్నా ..

మీరు ఇక్కడ ఉంటె బావుండునని .. నా మనసు లోని మాటలు మీకు వినబడ్డాయా ? చిప్పిల్లిన కళ్ళతో అంది

రచన .

అతడు చిన్నగా నవ్వి .. అంతా ముందే నిర్ణయింప బడి ఉంటుందని నీకెప్పుడు చెబుతూ ఉంటా కదా తల్లీ .. మరి

సందేహమెందుకు ?నువ్వు విజయం సాధించగలవని నేను ముందే చెప్పానుగా .. అయినా నీవలనే నాకూ కొన్ని

బాధ్యతలు ఉన్నాయి .. అవే ఈనాడు నేనిక్కడ ఉండటానికి కారణం .. అన్నారు స్వామీజీ ..

దూరం నుండి వీరిని చూస్తున్న శివ .. యశ్ .. ఎవరాయన ? అని అడిగాడు ..

యశ్వంత్ చిరునవ్వుతో అన్నాడు .. మురారీ .. నీ సమస్య కి సమాధానం దొరికి పోయింది .. అని....

ఏమంటున్నావు యశ్వంత్ ? అన్నాడు మురారి .

కొన్ని నిమిషాల క్రితం మన మధ్యన నలిగిన సమస్య .. సత్య .. తన ఆరోగ్యం .. ఒక దివ్య పురుషుడు  కావాలి

తనని నయం చేయటానికి .. అతడే యితడు .. ఇది ఆ వైష్ణవీ మాత కృప కాక మరేంటి ? అన్నాడు యశ్వంత్ .

ఇతడా ? నాకు నమ్మకం లేదు .. యశ్ .. అన్నాడు మురారి .

లేదు మురారీ .. ముందు అతడిని పలకరిద్దాం పదండి .. అని ముందుకు కదిలాడు యశ్వంత్ ..

పద మురారీ .. వాదనలకి ఇది సమయం కాదు .. పద .. అన్నాడు శివ . ఆ ఇరువురూ యశ్ ని అనుసరించారు .

అమ్మ .. అమ్మ ఎలా ఉంది స్వామీజీ ? నాది అత్యాశ అయిపోతుందేమో .. తను కూడా ఇక్కడ ఉంటె బావున్నని

పించింది .. అంటుంది రచన వీరు ముగ్గురూ వారిని చేరుకునే సరికి ..

స్వామీజీ చిరునవ్వు తో .. నాయన లారా ఎలా ఉన్నారు ? మీ ధైర్యం ,రక్షణ ఈనాడు ఈ విజయానికి బాసట గా

నిలిచాయి .. అన్నరు  చిరునవ్వుతో స్వామీజీ ..

ఆ ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు .. తదుపరి .. యశ్వంత్ ముందుకి వచ్చి ఆశీర్వదించండి

స్వామీజీ .. అని వంగి అతడి పాదాలకి నమస్కరించాడు ..

శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు .. అన్నారు స్వామీజీ ..

అతడి వైపు చిరునవ్వుతో చూసి నేను మీకోసం చాల విన్నాను .. కానీ ఇదే మొదటి సారి చూడటం .. సంతోషం గా

ఉంది మిమ్మల్ని కలవటం .. అన్నాడు యశ్వంత్ .

ఈనాడు మనం ఇక్కడ కలవటం అనేది విధి లిఖితం నాయనా .. అన్నారు స్వామీజీ .. తర్వాత తన వైపే విచిత్రంగా

చూస్తున్న మురారి ని చూసి .. నాయనా .. మనసు వికలమై ఉన్నావు .. నువ్వు ఎదురు చూస్తున్న పరిష్కారం

నేనే .. వెళ్లి ఆమె ని తీసుకురా .. రేపు ఉదయానికి ఆమె మీతో పాటూ నవ్వుతూ తిరగాలిగా .. అన్నారు స్వామీజీ .

మురారి ఆశ్చర్యంగా చూసాడు .. అతడే కాదు .. రచన తో పాటు యశ్వంత్ , శివ కూడా విస్తుపోయారు ..

అలా చూస్తావేం నాయనా .. వెళ్ళు .. భూతరేఖ ని చేదించి ఆమె కి విముక్తి ప్రసాదిస్తాను .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. అంటూ అతడి కాళ్ళ పై పడి కన్నీళ్ళతో అతడి కాళ్ళని అభిషేకించాడు మురారి ..

స్వామీజీ .. సత్య ని మీరే నయం చేయగలరు .. ఇదంతా అమ్మవారి లీల .. అర్థం అవుతుంది స్వామీ .. అన్నాడు

యశ్వంత్ చెమర్చిన కళ్ళతో ..

ఇంకా ఉంది






మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: