Powered By Blogger

Thursday 31 July 2014

రుధిర సౌధం 209


యశ్వంత్ మనసు కకావికలం గా ఉంది .. అతడలా లాన్ లోనే నిరాసక్తం గా ఉండి పోయాడు .. ఏం జరగబోతుంది ?

అన్న మానసిక ఆందోళన అతని మొహం లో కదలాడుతుంది .. ఇంతలో వెహికల్ హార్న్ వినిపించి గేటు వైపు

చూశాడు ..

శివ, మురారిలు సత్య ని తీసుకువచ్చినట్లు ఉన్నారే   ... అని అటు  నడిచాడు.. యశ్ .

రచన కి వెహికల్ సౌండ్ వినిపించిందేమో ... తానూ పరుగు పరుగున వెహికల్ దగ్గరికి వచ్చింది ....

అందరూ కలసి సత్య ని వెహికల్ నుండి దించి మహల్లో ముందుగానే సిద్ధం చేసి ఉంచిన గది లోనికి తీసుకు

వచ్చారు. మెత్తని పరుపు మీద ఆమె ని పరుండ బెట్టారు .

మీరంతా ఇక్కడే ఉండండి .. నేను వెళ్లి స్వామీజీ కి చెప్పి వస్తాను అని ఆ గది లోంచి బయట కి నడిచింది ... రచన .

యశ్ .. నా సత్య మళ్ళి మామూలు అయిపోతుంది కదా .. ఆశ గా అడిగాడు మురారి ...

అవును మురారీ .. బట్ సత్య కి బాగవగానే .. నువ్వు వెంటనే ఇక్కడ నుండి సత్య ని పట్టుకొని వెళ్ళిపో ... అన్నాడు

యశ్వంత్ .

యశ్ .. ఏమిటలా అంటున్నావు ? ఏమయ్యింది ? ఆందోళన గా అడిగారు మురారి , శివ .

శివా .. వీలుంటే నువ్వు కూడా .. అన్నాడు యశ్వంత్ .

మురారి , శివా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ..

కానీ ..  ఏం జరిగింది ? ఇప్పుడు అంతా ప్రశాంతం గా ఉన్న సమయం లో మనం ఒకరిఒకరు ఆనందం లో కూడా

తోడు ఉండాలి కదా .. అన్నాడు శివ కాసింత చిరాగ్గా .

యశ్ ... నేను రేపు ముంబై తిరిగి వెళ్ళిపోతానని అన్నానని నీకు కోపం వచ్చిందా ? ఏదో .. అప్పుడు సత్య గురించి

ఉన్న కంగారులో నేనా నిర్ణయం తీసుకున్నాను .. బట్ ఇప్పుడు సత్య కి బాగైపోతుంది .. ఇంకా నేను ఆందోళన

పడను.. యశ్ .. ప్లీజ్ .. అన్నాడు మురారి .

లేదు మురారీ .. నేను అలా ఆలోచించలేదు .. పరిస్తితులంతా సర్దుకున్నాక మళ్ళి వద్దురు గానీ .. అన్నాడు యశ్ .

ఏమన్నావ్ యశ్ ? పరిస్తితులంతా సర్దుకున్నాక .. అంటే ఇంకా సర్డుకోలేదని నీ ఉద్దేశ్యమా ? ఎందుకో ఆందోళన

గా ఉన్నావు యశ్ .. చెప్పు ఏం జరిగింది ? అన్నాడు శివ  అనునయం గా ..

అరె .. నేను చెబుతుంటే మీకు అర్థం కావటం లేదా ? కోపం గా గట్టిగా అరిచాడు యశ్వంత్ .

అతని అరుపు కి నిద్రలో ఉన్న సత్య   ఉలిక్కి పడింది ..

మురారి యశ్వంత్ వైపు సంభ్రమం గా చూసాడు ..

యశ్ ముందు బయటికి పద .. అని యశ్వంత్ భుజం మీద చేయి వేసి .. మురారి వైపు చూసి .. సత్య ని నువ్వు

చూసుకో మురారీ .. అని గది బయట కి నడిచాడు శివ , యష్ తో పాటూ ..


    ఇంకా ఉంది

  

   




మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: