Powered By Blogger

Wednesday 30 July 2014

రుధిర సౌధం 208

మురారిని లేపి .. వెళ్ళు నాయనా .. వెళ్లి తీసుకురా ..  బిడ్డ ఆడుతూ పాడుతూ తిరుగుతుంది .. అన్నారు స్వామీజీ .
లెట్స్ గో మురారీ త్వరగా వెళ్లి సత్య ని తీసుకొద్దాం .. ఆయన నయం చేస్తారు తనని .. అన్నాడు శివ ఆత్రుతగా .

కళ్ళు తుడుచుకుని .. ఆశీర్వదించండి స్వామీ .. నేను నా సత్య ని తీసుకొస్తాను .. అన్నాడు మురారి ..

మనోవాంచా ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ ..

వేల్లోస్తాను స్వామీ .. అని వెహికల్ వైపు పరుగు తీశారు శివ , మురారి .

చిరునవ్వుతో అంతా చూస్తున్న రచన .. థాంక్ యు .. థాంక్ యు స్వామీజీ .. అంది చెమర్చిన కళ్ళతో ..

రచనా .. నేనిచ్చిన తాయెత్తు ని పోగొట్టుకున్నావు కదూ .. అన్నారు స్వామీజీ ఆమె వైపు సూటిగా చూస్తూ ..

అవును స్వామీజీ .. మీకంతా తెల్సు .. నేను వివరించి చెప్పేదేముంది ? అంది రచన నిరాశగా ..


ఆ తల్లి ఆశీర్వాదం నీకు ఉంది .. ఆందోళన తగదు .. నిండు మనసు తో ఈ కార్యాన్ని నువ్వు  చేయవలసి

ఉంటుంది .. మనోనిబ్బరం తో ఇంతవరకూ వచ్చిన నువ్వు నీ మనసులో ఆందోళన కి ఎందుకు తావిస్తున్నావు ?

అన్నారు స్వామీజీ .

ఓహ్ గాడ్ .. ఇన్ని విషయాలు ఈయన కెలా తెలిసాయి .. వీటినే దివ్య శక్తులంటారేమో.. అనుకున్నాడు యశ్వంత్

మనసులో ..

స్వామీజీ .. మీరెందుకిలా చెబుతున్నారో నాకు అర్థం అయింది .. మరోసారి ఇలా జరగదు స్వామీజీ .. అంది రచన .

సరే ,,,వెళ్ళు .. నాకోసం తగిన ఏర్పాట్లు చెయ్ .. స్నానం చేసి పూజ కానివ్వాలి .. అన్నారు స్వామీజీ .

అలాగే స్వామీజీ .. అని యశ్వంత్ వైపు చూసి .. నువ్వు స్వామీజీ తో ఉండు యశ్వంత్ .. అంది రచన .

రచన అలా వెళ్ళాక .. ఒక్కసారిగా యశ్వంత్ చేతిని తన చేతిలోకి తీసుకొని మంత్రం జపిస్తూ అతడి చేతికి ఒక

రక్షా దారాన్ని కట్టారు స్వామీజీ ..

అవాక్కై .. ఏంటిది స్వామీజీ .. అన్నాడు యశ్వంత్ ..

చూడు నాయనా .. చుట్టూ ఉన్న పరిస్తితులు అనుకూలంగా కనబడుతున్నాయి .. కేవలం కనబడుతున్నాయి ..

అంతే .. దానర్థం అనుకూలం గా ఉన్నాయని కాదు .. అసలు పోరాటం మిగిలేఉంది .. సమస్య ని పూర్తిగా

పరిష్కరించాలి .. దానర్థం .. అంతం .. ఏదైనా సమస్య ని అంతం చేయాలి తప్ప .. దాన్ని కప్పిపెట్టి సమస్య

పరిష్కారమయిందని భావిస్తే అది మూర్ఖత్వమవుతుంది .. పోరాటం నువ్వు చేయాలి .. అందుకు నీకు బాసట గా

అమ్మవారి రక్షణ .. ఇది అమ్మవారి రక్షణ .. అన్నారు స్వామీజీ ..

అంటే ... అన్నాడు యశ్వంత్   ఆశ్చర్యంగా ..

సమస్య పరిష్కారం కాలేదు నాయనా .. ఈ ప్రశాంతత భగ్నం కాకుండా సమస్యని పరిష్కరించు .. అందుకు నీకు

తోడుగా నేను ఉంటాను .. పరిశుద్ధుడను అయిన పిదప పూజలో కూర్చుంటాను .. నువ్వు అప్రమత్తం గా ఉండు ..

ఇది తుఫాను ముందు ప్రశాంతత .. అన్నారు స్వామీజీ .

యశ్వంత్ కి కాళ్ళ కింద భూమి కదులు తున్నట్లు అనిపించింది ..

కలవరపడకు అన్ని  సవ్యం గా జరుగుతాయి .. పౌర్ణమి చంద్రుని మబ్బులు ఎంతసేపు కప్పి ఉంచగలవు ? మనసు

లో ధైర్యం మనకి ముందుకి నడిపిస్తుంది .. నువ్వు ముందుకి నడవక తప్పదు నాయనా .. అన్నారు

స్వా మీజీ రమణానంద .

అర్థమైంది స్వామీ .. నేను అప్రమత్తంగానే ఉంటాను .. మీరు దగ్గరుండి ఈ కార్యం నిర్వర్తించండి .. అన్నాడు

యశ్వంత్ స్థిరంగా ..           
                                       ******************************
ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: