Powered By Blogger

Wednesday 17 September 2014

రుధిర సౌధం 246


దీపాల కాంతుల్లో ధగ ధగాయ మానం గా వెలుగుతున్న ఆలయాన్ని మనసారా చూసుకుంది రచన . ముచ్చటగా

ఆమె వైపు చూశాడు యశ్వంత్ .

సంతోషం అంటే అర్థం ఈరోజే తెలిసినట్టుంది కదూ .. అన్నాడు ఆమె ని చూసి ..

ఆమె అందంగా నవ్వింది .. అతని కళ్ళలోకి చూస్తూ .. ఎదుటి వారి మంచి ని కాంక్షించి చేసే పని ఏదైనా సరే

విజయం సాధిస్తుంది యశ్ .. ఎందుకో ఈ క్షణం అమ్మ  ఎక్కువగా గుర్తొస్తుంది .. తను నాతో ఇప్పుడు ఉండి

ఉండుంటే బావుండు నని పిస్తుంది .. అంది రచన .

నిజమే .. ఆంటీ ఉండుంటే సంతోషం పట్టలేకపోయేవారు .. పోనీ ఈ కార్యక్రమం పూర్తి కాగానే వెళ్లి ఆంటీ ని

తీసుకువద్దాం.. అన్నాడు యశ్వంత్ .


ఊ .. అని మెల్లగా తలాడించింది రచన .

ఇంతలో గుడి నంతటినీ వీడియో తీసిన శివ , మురారి వీళ్ళ  ని చూసి .. రచనా .. ఇక వెళ్దామా ? అంతా మనకోసం

ఎదురు చూస్తూ ఉంటారు .. అన్నారు .

పద .. సాయంత్రం సహస్ర యాగం జరగాలి కదా .. ఆ ఏర్పాట్లు చూసుకోవాలి .. అని కూర్చున్న చోటినుండి లేచి

తన చేయి రచన కి అందించాడు . అతని చేయి పట్టుకుని లేచి నిలబడి  ఒకసారి అంతా తనివితీరా చూసుకొని ..

ఏమిటో .. ఇక్కడ్నుంచి వెళ్ళాలని పించడం లేదు .. అంది రచన .

మనం వెళ్తే స్వామీజీ వచ్చి ఏదో పూజ చేయాలన్నారు కదా .. వెళ్దాం రచనా .. అన్నాడు యశ్వంత్ .

సరే .. అని ముందుకి కదిలింది రచన ... ఆమెని అనుసరించారు మిగిలిన ముగ్గురూ ..

                                          *************************************

విక్కీ .. మనం ఊర్లోకి ప్రవేశించాం .. అంది గిరిజ కిటికీ లోంచి బయటికి చూస్తూ ..

మెల్లిగా చీకట్లు పల్చబడుతున్నాయి .. వెలుగు రాక మొదలయింది ...

అమ్మా .. రచన ఎక్కడుంటుంది ? ఏమైనా చెప్పిందా ? అన్నాడు విక్కీ తాను చుట్టూ చూస్తూ ..

తెలీదు .. అదేం చెబుతుందా ఏం ? అని .. డ్రైవర్ కాస్త పక్కగా ఆపు .. అంది గిరిజ .

కార్ ఓ పక్కగా ఆగింది .. ఎదురుగా చెంబు పట్టుకుని వస్తున్న ఓ వ్యక్తీ ని చూసి .. విక్కీ అతన్ని కాస్త అడుగు ..

రచన ఎక్కడున్నదీ చెబుతాడు .. అంది గిరిజ .

విక్కీ కార్ దిగి .. ఏమయ్యా .. అని అరిచాడు ..

అతడు విక్కీ ని ఎగాదిగా చూసి కార్ వైపు , కార్ లో ఉన్న గిరిజ వైపు చూసి .. పట్నమోల్లు .. అనుకుంటూ విక్కీ

దగ్గరికి వచ్చి .. ఏం కావాలె ? అన్నాడు ,

ఆ .. అదీ .. రచన .. రచన తెలుసా మీకు ? అన్నాడు విక్కీ సంకోచంగా .

రచనా .. ఆ పేరు తో ఎవరున్నరాబ్బ ఈ ఊళ్ళో .. అని అన్నాడు సాలోచన గా అతడు .

యశ్వంత్ .. యశ్వంత్ .. తెలుసా మరి ? అని అడిగింది గిరిజ కార్ లోంచే .

ఓహ్ .. మీరు యశ్వంత్ బాబు కోసం వచ్చారా ? ఆల్లంతా మహల్ కాడే ఉన్నారు .. ఈనాడు ఆడ పెద్ద పండగ కదా ..

మీరూ అందుగే వచ్చారా ? హుషారుగా ఎదురు ప్రశ్నించాడు అతడు .

మహల్ దగ్గరా ? ఆశ్చర్యంగా అడిగారు గిరిజ , విక్కీ ఒక్కసారిగా ..

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: