Powered By Blogger

Tuesday 16 September 2014

రుధిర సౌధం 245

I
ఆ ప్రమిద నిండుగా నేతిని పోసి ఒత్తి ని నేతిలో ముంచి దీపం వెలిగించింది రచన .. ఒక్కసారిగా ఆ ప్రాంగణ మంతా

వెలుగుతో నిండి పోయింది ..

జై వైష్ణవీ మాతా .. అని అరిచారు నలుగురూ ఏక కంఠం తో ..

అమ్మవారు జ్యోతిని దర్శించాక విగ్రహాన్ని యథాస్థితి కి తీసుకు వచ్చింది రచన .. ఆమె మనసంతా ఆనందం తో

నిండి పోయింది .. ఆ అఖండ జ్యోతి వెలుగులో అమ్మవారు వారిని చిరునవ్వుతో చూస్తున్నట్టు ఉంది ..

అందరూ సంతోషం గా అమ్మ కి నమస్కరించారు ..

రచనా .. ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా దీపాలు వెలిగించాలి .. అమావాస్య రోజే దీపావళి వస్తుంది .. కానీ ఏ పౌర్ణమి

వెలుగు నిoపకపోయినా  .. ఈ పౌర్ణమి మాత్రం ఈ మహల్ కి ఎప్పటికీ నిలిచిపోయే వెలుగు నిచ్చింది .. అన్నాడు

యశ్వంత్ తృప్తి గా అమ్మవార్ని చూస్తూ ..

మా నాన్న , మా పూర్వీకుల ఆత్మలు శాంతించి ఉంటాయి కదా యశ్వంత్ .. నా కళ్ళతో చూశాను వారి ఆత్మ

ఘోషించటం .. అంది రచన కళ్ళ నిండా నీళ్ళతో ..

తప్పకుండా రచనా .. బి హ్యాపీ .. కంట నీరు పెట్టాల్సిన సమయం కాదిది అన్నాడు యశ్వంత్ ..

రచనా .. ఇప్పుడు మేముకూడా దీపాలు వెలిగించవచ్చు కదా ఇక్కడ ? అని సంతోషం గా అడిగిన శివ ని చూసి

అవునన్నట్లు తల ఊపింది రచన .

వెంటనే దీపాలు వెలిగించటం లో  నిమగ్నమయ్యారు వారంతా ...


గుడి ప్రాంగణ మంతా దీపకాంతులతో దేదీప్యమానం గా వెలగసాగింది .. అదే సమయం లో మహల్ బయట చెట్టు

మీద కూర్చుని తగిన అవకాశం తో ఎదురు చూస్తున్న వైజయంతి ఆత్మ ఆ వెలుగు ని భరించలేక హృదయ

విదారకం గా ఏడ్చింది ..

మహల్ అంతా ఓ చిత్రమైన కాంతి నిండి పోవటం తో .. స్వామీజీ .. మహల్ అంత టా ఏదో వెలుగు నిండి పోతోంది  ..

పరుగున వచ్చి అంది స్వామీజీ తో సంతోషం గా సరస్వతి .

మహల్ అంతటా నిండిన ఆ కాంతిని చూసి మందహాస వదనం తో .. ఆలయం లో అఖండ జ్యోతి వెలిగింది ..

అమ్మవారు మహల్ కి తిరిగివచ్చిన శుభ సూచన ఇది .. అన్నారు స్వామీజీ ..

గోపాల స్వామీ , సరస్వతి ఇద్దరు స్వామీజీ వైపు చిరునవ్వుతో చూశారు ..

సరస్వతి .. వెళ్లి ఓ గది ని సిద్ధం చెయ్యి .. అయినవారు వస్తున్నారు .. అన్నారు స్వామీజీ ..

అలాగే స్వామీ .. అని అక్కడ్నించి కదిలింది సరస్వతి .

ఎవ్వరు స్వామీ ? అని అడిగాడు గోపాలస్వామి .. వినయంగా ..

గిరిజా దేవి .. తన బిడ్డతో పాటూ మరికొద్ది సేపటిలో ఇక్కడికి చేరుకోనుంది .. ఇక్కడి మంచి చెడులను

అనుభవించడానికి ఆమె కీ హక్కు ఉన్నది కదా .. అన్నారు స్వామీజీ ..

సంతోషం స్వామీ .. రచనమ్మ మనసులో కూడా ఆమె తల్లి ఇక్కడ ఉంటే బావుండునన్న భావన దాగి ఉన్నది ..

అన్నాడు గోపాలస్వామి .

స్వామీజీ మందహాసం తో తిరిగి ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు

ఇంకా ఉంది





మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: