Powered By Blogger

Thursday 18 September 2014

రుధిర సౌధం 247



ఆ .. అవును .. ఏంది భయపడతున్నారా ? ఆ రోజులు పోయినాయి .. యువరానమ్మ వచ్చింది గదా .. అదే మా

ధాత్రమ్మ .. చాలా మంచిది .. ఈరోజు ఊరందరికీ భోజనాలు ఆడే .. అన్నాడు అతడు .

సరే .. ధన్యవాదాలు .. అన్నాడు విక్కీ .

అతడు చిరునవ్వుతో ముందుకి సాగిపోయాడు ..

అమ్మా .. ధాత్రమ్మ అంటున్నాడు .. బహుశా మన రచనే అయుండొచ్చు .. కానీ మహల్ లో ఉన్నారంటే ఆశ్చర్యం

గా ఉంది .. అన్నాడు విక్కీ .

విక్కీ .. నాకు మాత్రం సంతోషం గా ఉంది .. చూస్తుంటే రచన అనుకున్నది సాధించింది అనిపిస్తుంది .. పద విక్కీ ..

మహల్ కె పోదాం .. అంది గిరిజ .

విక్కీ కార్ లో కూర్చున్నాక .. స్ట్రెయిట్ గా పోనీ .. అంది గిరిజ .

అమ్మా .. మనం మహల్ కి వెళ్తున్నాం .. అతడి మాటలు నమ్మి .. ఇది కర్రెక్టేనా ? అన్నాడు సంకోచంగా విక్కీ .

విక్కీ .. ఊరంతా అలంకరించి ఉంది గమనించావా ? అంటే ఏదో సంతోషం ఈ గ్రామస్తులని చేరింది .. అది నీ చెల్లెలే

అని నా నమ్మకం .. అనుమానం పెట్టుకోకు .. వెళ్తున్నాం కదా .. అంది గిరిజ ఉత్సాహం గా ..

 కార్ మహల్ కేసి సాగిపోయింది ..

                                                         **********************

ఆలయం నుండి వెలుపలకి రాగానే ఎదురుగా ఉన్న స్వామీజీ పాదాలకి సంతోషం గా నమస్కరించింది రచన .

తల్లీ .. నీ సంతోషాన్ని అర్థం చేసుకోగలను .. మనో వాంఛా ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ ..

స్వామీజీ .. నాన్నగారికి ఇదంతా తెలుస్తుంది కదా .. అంది రచన ..

తప్పక తెలుస్తుంది తల్లీ .. ఈరోజు నువ్వు చేస్తున్న ఈ కార్యం నీ పూర్వీకులు అందరికి శాంతి నిస్తుంది .. ఈ ఊరు

బాగుపడుతుంది .. అన్నారు స్వామీజీ ..

స్వామీజీ .. రచన కె కాదు మా అందరికి కూడా ఇది జీవితాంతం మరవలేని జ్ఞాపకం .. అన్నాడు మురారి ..

అవును .. మా మనస్సులో ఈ అదృష్టానికి సంతోషం పొంగి పోర్లుతోంది .. అన్నారు శివ ,యశ్వంత్ .

నిజమే .. ఈ తల్లి మనసులో ఇంకా ఏదో చిన్న వెలితి .. కదూ .. అన్నారు స్వామీజీ ..

అయ్యో .. అదేం లేదు స్వామీజీ .. అంది కంగారుగా రచన .

స్వామీజీ చిరుమంద హాసం తో .. నా ముందరే అబద్ధం చెబుతున్నావా తల్లీ .. ఆ తల్లి కోసం ఇంత చేశావు .. ఆ తల్లి

నిన్ను నీ తల్లి ని దూరంగా ఉంచుతుందా ? వెళ్ళు .. వెళ్లి గిరిజా దేవిని లోపలకి ఆహ్వానించు .. అన్నారు స్వామీజీ .

స్వామీజీ .. ఏమంటున్నారు మీరు ? ఆశ్చర్యంగా  అడిగింది రచన .

శివ , యశ్వంత్ , మురారిలు కూడా అతడి వైపు ఆశ్చర్యంగా చూశారు ..

స్వామీజీ ఎప్పుడన్నా అబద్ధం చెప్పారా ? అనుమానం వద్దు వారిని ఆహ్వానిద్దాం పదండి .. అన్నాడు నవ్వుతూ

గోపాలస్వామి .

సంతోషం తో కళ్ళు చెమ్మగిల్లాయి రచన కి .. రచన భుజం మీద చేయి వేసి .. నువ్వు అమ్మవారి సన్నిధి లో అమ్మ

ఉంటే బావుండు ననుకున్నావు .. ఆ వైష్ణవీ మాత ఎంత దయగలదో చూడు .. పద రచనా .. వెళ్లి ఆంటీ ని లోపలికి

ఆహ్వానిద్దాం .. అన్నాడు యశ్వంత్ .

 కళ్ళు తుడుచుకుని ముందుకి  సంతోషం గా కదిలింది రచన .. అంతా మెయిన్ గేటు వైపు నడిచారు ..

ఇంకా ఉంది



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: