Powered By Blogger

Friday 19 September 2014

రుధిర సౌధం 248

రచన , యశ్వంత్ తదితరులు మహల్ వెనుక భాగం నుంచి మహల్ ముందు భాగం కి చేరుకునేసరికి చీకట్లు చీల్చు

కుంటూ కార్ ఫ్లడ్ లైట్స్ కాంతి మహల్ గేటు పై పడింది ..

రచన .. మనసు సంతోషం లో తేలియాడుతుంది .. శివ ఫాస్ట్ గా వెళ్లి గేటు ఓపెన్ చేశాడు .. కార్ గేటు దగ్గరకి

చేరుకున్నాక ఎందుకో ఆగింది .. శివ కార్ దగ్గరికి వెళ్ళాడు .. లోపల్నుంచి గిరిజ .. గ్లాస్ దించి .. మేము బొంబాయి

నుండి వస్తున్నాము .. రచన ఉందా ఇక్కడ ? అని అడిగింది సంకోచం గా ..

శివ నవ్వుతూ .. మేము మీకోసమే ఎదురుచుస్తున్నాము ఆంటీ .. అదిగో అటు చూడండి .. అని రచన వైపు చేయి

చూపాడు  శివ .

శివ చూపించిన వైపు చూసిన గిరిజ .. పరుగున వస్తున్న రచన ని చూసి ఆశ్చర్యపోయింది .. ఆమె ఆ దుస్తుల్లో దేవ

కన్యలా ఉంది .. " వస్తుంది నా కూతురేనా ? " అంది స్వగతం గానే .

అనుమానం లేదు ఆంటీ .. తను ఈ కోట కి యువరాణి .. పదండి .. అని ముందుకి నడిచాడు శివ .. కార్ డ్రైవర్ కి

లోపలికి రమ్మని సైగ చేస్తూనే ..


గిరిజ వడివడిగా నడిచి గేటు దాటుకుని లోపలికి నడిచింది .. ఈలోపు .. పరుగున వచ్చిన రచన .. అమ్మా .. అంటూ

హత్తుకుంది .. ఆప్యాయంగా తన కూతుర్ని గుండెలకి అడుముకుంది గిరిజ .. వాళ్ళిద్దరి కళ్ళల్లోంచి ఆనంద

భాష్పాలు పొంగి ప్రవహిస్తున్నాయి .. ఈలోపు డ్రైవర్ కార్ ని మహల్ ప్రాంగణం లో పార్క్ చేశాడు ..

యశ్వంత్ నవ్వుతూ రచన , గిరిజల దగ్గరి కొచ్చాడు ..

ఆంటీ .. మీ కూతురు విజయం సాధించింది .. కానీ ఆ సంతోషపు సంబరాల్లో మీరు తనతో లేరని బాధ పడింది ..

అమ్మ కదా మీరు .. తన మనసు గ్రహించినట్టే ఇక్కడికి సమయానికి చేరుకున్నారు .. అన్నాడు యశ్వంత్ గిరిజ

పాదాలకి నమస్కరిస్తూ .. అతన్ని ఓ చేతితో దగ్గరికి తీసుకుని .. నువ్వు తనకి తోడుగా ఉన్నావు కదా యశ్వంత్ ..

ఇంకా నాకు భయం ఏముంది ? అంది ప్రేమగా రచన ని , యశ్వంత్ ని చూస్తూ ..

ఏ కోతీ .. నేనూ వచ్చాను నన్నసలు చూడనే లేదు నువ్వు .. అన్న మాటలు విని వెనక్కి తిరిగారంతా .. అక్కడ

చిరునవ్వుతో విక్కీ నిలబడి ఉన్నాడు ..

విక్కీ ని చూడగానే .. సంతోషంతో కూడిన  ఆశ్చర్యం తో .. అన్నయ్యా .. అని వెళ్లి అమాంతంగా అతడిని హత్తుకుంది

రచన ..

ఏంటిరా ఇదంతా ? ఏంటీ అవతారం ? అన్నాడు ఆమె వైపు ఆశ్చర్యం గా చూస్తూ విక్కీ .

ఐ యాం ద ప్రిన్సెస్ అన్నయ్యా .. అంది తమాషా గా .. రచన .

హే విక్కీ .. అంటూ వచ్చి చేయి కలిపాడు యశ్వంత్ .

యశ్ .. నువ్వు ఇక్కడే ఉన్నావు .. దీన్ని పట్టుకుని వచ్చేయక .. నాకు బోర్ కొట్టింది .. అందుకే అమ్మని పట్టుకుని

వచ్చేసాను .. అన్నాడు విక్కీ .

చాలా మంచి పని చేసావు విక్కీ .. వుయ్ ఆర్ వేరి హ్యాపీ .. అన్నాడు యశ్వంత్ .

రచనా .. ఇదంతా ఎలా ? మహల్ రూపు రేఖలే మారిపోయాయి .. ఇదంతా నమ్మశక్యం గా లేదు నాకు .. అంది

గిరిజ  వీరి వద్దకి వచ్చి ..

ముందు మీ ఇద్దరూ లోపలికి పదండి .. అన్నీ అవే అర్థ మవుతాయి .. అంది రచన ..

ఇంకా ఉంది









మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: