Powered By Blogger

Tuesday 23 September 2014

రుధిర సౌధం 250

250 వ భాగం 






ఇంత వరకు మా యువరాణి నే చూశామను కున్నాం .. మహారానమ్మ కుడా చుసేసినాం .. అంది సరస్వతి

తమాషాగా ..

సరస్వతి మాటలకి గలగలా నవ్వింది రచన .

అలా నవ్వుతున్న కూతుర్ని ముచ్చటగా చూసింది గిరిజ ..

ఏంటమ్మా ? అలా చూస్తున్నావు ? అంది రచన నవ్వటం ఆపి .. తన వైపే తదేకం గా చూస్తున్న తల్లిని చూసి ..

నాకిప్పటికి నమ్మశక్యంగా లేదు రచనా .. నేను కలగనడం లేదు కదా .. అంది గిరిజ .. అమాయకంగా .

లేదు .. ఇదంతా నిజం .. నిజంగా నిజం .. సాయంత్రం గుళ్ళో సహస్రయాగం .. అంటే మన పూర్వీకుల ఆత్మ

లన్నింటికి శాంతి .. నాన్న సంతోషిస్తారమ్మా .. అంది రచన ఆర్ద్రతగా ..

నువ్వు సాధించావు రచనా .. నిజంగా ఇదంతా అంత తేలిగ్గా జరిగే పని కాదు .. కానీ జరిగింది .. నువ్విక్కడ ఏం

కష్టం పాలవుతున్నావో అని భయంగా వచ్చాను .. బట్ .. ఇప్పుడు నిన్నింత సంతోషం గా చూస్తుంటే .. బావుంది ..

అన్నాడు విక్కీ చెల్లెలి భుజం మీద ప్రేమగా చేయి వేస్తూ ..

ఇదంతా ఏం అంత సులువుగా కాలేదు .. నేనొక్కదాన్నే కష్టపడలేదు .. యశ్వంత్ , శివ , మురారీ , సత్య .. అందరూ

.. అందరూ నాకు తోడుగా నిలిచారు .. అని సత్య అంటే గుర్తొచ్చింది .. నిన్న స్వామీజీ చెప్పారు నాకు .. రేపు

ఉదయానికి ఓ డాక్టర్ సత్య ని చూడటానికి రాబోతున్నారని .. కానీ నాకర్థం కాలేదు .. ఇప్పుడు అర్థమయ్యింది

ఆ డాక్టర్ నువ్వేనని .. అంది రచన ..

ఏం ఆ అమ్మాయి కి ఏం జరిగింది ? అంది గిరిజ బాధగా ..

అమ్మా .. ఏం జరిగినా .. సరే .. అదంతా అయిపొయింది .. ఇప్పుడు అంతా జరిగేది శుభమే .. సత్య కి కొంచెం

బాలేదు .. అని విక్కీ వైపు తిరిగి .. అన్నయ్యా .. నువ్వు సత్యని బాగు చేస్తావుగా .. అంది రచన ముద్దుగా ..

ఎందుకు చేయను ? నా ముద్దుల చెల్లెలికి అంత సహాయం చేసిన ఆ అమ్మాయి కి తప్పనిసరిగా బాగవుతుంది రా ..

అన్నాడు విక్కీ .

వీళ్ళ కెదురుగా కూర్చున్న మురారిని చూసి .. మురారీ .. అన్నయ్య యు . ఎస్ లో పెద్ద డాక్టర్ .. సత్య కి తనే

ట్రీట్ మెంట్ చేస్తాడు .. అంది రచన .

థాంక్ యు .. విక్కీ .. అన్నాడు మురారీ .

ఇంతకీ మై బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ? వాడు బయటే ఉండిపోయాడా ? అని మురారిని అడిగాడు విక్కీ .

యశ్వంత్ , శివ బయటే ఉన్నట్టున్నారు .. పిలవనా ? అన్నాడు మురారి లేస్తూ ..

వద్దొద్దు .. వాడే వస్తాడు .. ఇడియట్ .. అని గిరిజ వైపు తిరిగి ,అమ్మా .. స్వామీజీ పూజ ముగించుకు వచ్చేలోపు

నేను , నువ్వు ఫ్రెష్ అయిపోతే బెటర్ కదా .. అన్నాడు విక్కీ .

అవును .. అని సరస్వతి వైపు చూసి .. సరస్వతీ .. నువ్వు గది సిద్ధం చేసి ఉంచావుగా .. అంది రచన .

అవునమ్మా .. ఆ మూల గది .. అన్నయ్య గారు వస్తున్నారని తెలీక గది సిద్ధం చేయలేదమ్మ .. అంది సరస్వతి .

ఏం ఫర్వాలేదు .. విక్కీ మా గదిలో ఉంటాడు .. అన్నాడు యశ్వంత్ ఆ హాల్ లోకి ప్రవేశిస్తూనే ..

హే ఇడియట్ .. ఇంతసేపు బయటే ఉండిపోయావెం ? అన్నాడు విక్కీ యశ్వంత్ ని చూస్తూనే ..

సారీ విక్కీ .. పద గదిలోకి ముందు ఫ్రెష్ అవుదువ్ గానీ .. తర్వాత స్వామీజీ ని కలుద్దురు .. ఆయన గుడిలో

ఉన్నారు .. అని విక్కీ భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్తుండగా .. యశ్ .. అని పిల్చింది రచన .

ఆమె వైపు ప్రస్నార్థకంగా చూశాడు యశ్వంత్ .

సరస్వతీ .. నువ్వు అమ్మని తీసుకెళ్ళు .. అని యశ్వంత్ కేసి నడిచింది రచన .

శివ వచ్చి .. మీరు పదండి .. నేను తీసుకువెళ్తాను మిమ్మల్ని గదిలోకి .. అని విక్కీ ని వారి గది లోకి తీసుకు

వెళ్ళాడు .

ఏంటి ? అని వచ్చిన యశ్వంత్ ని చూసి .. నువ్వు చాలా బిజీ అయిపోయావ్ యశ్ .. అంది బుంగమూతి పెట్టి ..

రచన .

మేడం గారూ .. మా బావమరిది వచ్చాడు .. కొంచెం మంచి చేసుకోవాలిగా .. లేకుంటే పిల్ల నివ్వడు .. అసలే చిన్న

నాటి ఫ్రెండ్ .. చెల్లెల్ని ప్రేమించానని తెలిస్తే శత్రువై పోతాడేమో .. ఇక హారర్ స్టొరీ ముగించి లవ్ స్టొరీ లోకి వెళ్ళాలి

కదా .. అన్నాడు కొంటె గా కన్ను గీటుతూ .. యశ్వంత్ .

హు .. బావుంది .. అయితే మా అన్నయ్య కి కాకా పడతావన్న మాట .. ప్రయత్నించు .. నాకేం ఫర్వాలేదు ..

అంది తానూ తమాషాగా .

ఆహా .. పీత కష్టాలు పీతవి .. అన్నాడు యశ్వంత్ .

పో యశ్ .. నేనీ రోజు చాలా సంతోషం గా ఉన్నాను .. అందుకే మన విషయం కూడా అమ్మ తో చెప్పేయనా ?

అంది ఎర్రబడిన వదనం తో రచన

అయ్యో .. వద్దు రచనా .. తొందర పడకు .. ఈరోజు కార్యక్రమం అంతా సవ్యంగా అయిపోనీ .. ఈ హడావుడి ముగిసి

పోనీ .. అన్నాడు యశ్వంత్ .

నువ్వేగా అన్నావు ? హారర్ అయిపొయింది .. ఇంకా లవ్ స్టొరీ మొదలు .. అని .. అంది బుంగమూతి పెట్టి రచన .

అవును .. ఈరోజు తో ఈ హరెర్ స్టొరీ కి శుభం కార్డు పడాలి కదా .. ఈ ఒక్క రోజు ఆగు .. అన్నాడు యశ్వంత్ .

సరే .. నీ ఇష్టం .. అంది చిన్నబోయిన మొహం తో రచన .

డల్ గా ఉండకు .. ప్లీజ్ .. తెలుసుగా .. ఈరోజంతా నువ్వు సంతోషంగా ఉండాలి .. బోలెడు పని ఉంది .. మరి నేను

వెళ్ళనా ? అన్నాడు యశ్వంత్ ..

అలాగే నంటూ తల ఊపింది రచన . యశ్వంత్ గదిలోకి వెళ్లిపోతుంటే మనసులో అనుకుంది " నేను బాగానే ఉన్నా

యశ్ .. కానీ నువ్వే ఏదో కలవరం గా ఉన్నావని పిస్తుంది .. కానీ ఆ విషయం నాదగ్గర ఎందుకు దాయాలను కుంటు

నావో .. అర్థం చేసుకోగలను.. నువ్వు హ్యాపీ గా ఉన్నప్పుడే అమ్మతో , అన్న తో మన విషయం చెబుతాను  ".

ఇంకా ఉంది 

ఈరోజుతో 250 భాగాలు పూర్తి చేసుకుంది రుధిర సౌధం . ఇదంతా నా ప్రయత్నమే కాదు .. ఆదరిస్తున్న పాఠకుల అభిమానం . 
ధన్యవాదాలు మీ అందరికీ .. 

                                                                                      - రాధిక 

1 comment:

Anonymous said...

మీ కధ చాలాబాగుంది.....మీ తరువాతి కధలు కూడా ఇలాగే వుండాలి అని ఆసపడుతునాను