Powered By Blogger

Monday 22 September 2014

రుధిర సౌధం 249



భయం ఏమీ లేదా రచనా ? అంది భయం గా గిరిజ .

 తల్లి వైపు చిరునవ్వుతో చూస్తూ .. ఈరోజు ఉదయం అమ్మవారి గుడిలో దీపాలు వెలిగించి వచ్చానమ్మా ... అంది

రచన .

గిరిజ నమ్మలేనట్టు చూసింది కూతురివైపు ..

అవునాంటీ .. అందరం పూజ ముగించుకుని వచ్చాం .. వెంటనే మీరు రాబోతున్నారని స్వామీజీ చెప్పారు ..

అన్నాడు యశ్వంత్

మరి వైజయంతి .. అంది గిరిజ వణుకుతున్న స్వరంతో ..

ఆమె నోటి వెంట వైజయంతి పేరు వినగానే .. టక్కున ఆ చెట్టు వైపు చూశాడు యశ్వంత్ .. వైజయంతి కనబడ లేదు

అతని కళ్ళు చుట్టూ చూశాయి .. ఆమె కనబడలేదు .. చిన్నగా నిట్టూర్చాడు యశ్వంత్ .

ఇప్పుడు అలాంటి భయాలు ఏమీ లేవమ్మా ? ఇక మహల్ మనదే .. చూడు ఇంత మంది ఉన్నాం మహల్లో అంది

ఆప్యాయంగా తల్లి భుజం మీద చేయి వేసి రచన.

అవునమ్మా ? ఇప్పుడీ వాతావరణం చూస్తుంటే ప్రసాంతంగా ఉంది .. అయినా స్వామీజీ ఇక్కడే ఉన్నారు కదా ..

ముందు వెళ్లి ఆయన్ని కలుద్దాం పదమ్మా .. అన్నాడు విక్కీ .

అవును ఇదంతా వారి దయే .. పదండి వెళ్దాం .. అంది గిరిజ ..

వీరందరినీ చూస్తూ నవ్వుతూ నిలబడ్డ శివ , మురారి లని గిరిజకి , విక్కీ కి పరిచయం చేసింది రచన .

అందరూ మహాల్లోకి నడిచారు .. యశ్వంత్ , శివ తప్ప .

యశ్ .. ఆ చెట్టు దగ్గర వైజయంతి లేదు .. అన్నాడు మెల్లిగా శివ .

దానర్థం ఆమె ఎక్కడికో వెళ్ళిపోయిందని కాదు శివా .. మనం ఆమె ని చూడలేక పోతున్నామని .. ఇప్పుడు

వైజయంతి ఆలోచన ఏమిటో .. అన్నాడు యశ్వంత్ సాలోచన గా .

నిజమే .. యశ్ ... రచన అమ్మగారి కళ్ళలో ఎంత భయం కనిపించిందో .. సమస్య ఇంకా పరిష్కారం కాలేదని తెలిస్తే

ఈ మహల్లో ప్రశాంతత  మళ్ళి కోల్పోతుంది యశ్ .. అన్నాడు శివ .

శివా .. స్వామీజీ చెప్పిన వన్నీ నిజమవుతున్నాయి .. ఆయన మళ్ళి సమస్య ఉంది అని చెప్పారు .. తెల్లవారే

లోపు ఏదైనా జరగొచ్చని అనుకున్నాను .. కానీ ఇప్పుడు టైం 5 . 30 .. తెల్లారి పోయింది .. సో .. రాత్రే కాదు

వైజయంతి పగలు కూడా సిద్ధంగా .. అవకాశం కోసం చూస్తూ ఉంటుంది .. మనం అప్రమత్తంగా ఉండి తీరాలి

అన్నాడు    యశ్వంత్ .

అవును యశ్వంత్ .. నాకెందుకో గోపాలస్వామి మాటలు గుర్తుకొస్తున్నాయి .. వైజయంతి ని రచన స్వయం గా

లోపలికి ఆహ్వానిస్తే వైజయంతి లోపలికి రాగలదు అని .. అన్నాడు శివ .

అవును .. కానీ రచన వైజయంతి లేదనే అనుకుంటుంది .. ఉన్నా తనెందుకు ఆహ్వానిస్తుంది చెప్పు ? అన్నాడు

యశ్వంత్ .

లేదు యశ్వంత్ .. ఇందులో ఏదో మతలబు ఉంది .. మనకి అర్థం కావడం లేదు గానీ .. ఏదేమైనా మనం రచన కే

తెలియకుండా రచన ని కనిపెట్టుకుని ఉండాలి .. ఏవిధమైన తప్పు జరగకూడదుగా .. అన్నాడు శివ .

సాలోచనగా తల ఊపాడు యశ్వంత్ .

ఇంకా ఉంది



మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

1 comment:

venu prakash said...

Congratulations . Your and our serial will complete 250 milestone tomarrow.