Powered By Blogger

Monday 19 May 2014

రుధిర సౌధం 149


ప్రయోజనమా ? అని భయంకరంగా నవ్వింది ఆమె .

మహల్ ...... రాణి మహల్ .. నా తండ్రి .. ఆ చేతగాని మహారాజు .. తన రెండో భార్య మాయలో పడి .. మా అమ్మ కి

అన్యాయం చేసి .. ఆ వసుంధర కి కట్టబెట్టిన మహల్ .. న్యాయంగా అయితే అది నాది .. కానీ నాది కాకుండా ..

వేరొకరికి కట్టబెట్టాలనుకోవటం .. తప్పే కదా ... ఆమె మరింత ముందు కి నడుస్తూ అంది .

కానీ ఇప్పుడు .. నువ్వు ప్రాణాలతో లేవు వైజయంతి .. శరీరమే లేని నీకు .. నివాసం ఎందుకు ? భోగ భాగ్యాలపై


ఆశ ఎందుకు ? అడిగింది ఆవేశం గా రచన తన అడుగులు వెనక్కి

వేస్తూ ..

ఆమె గట్టిగా నవ్వింది తెరలుతెరలుగా నవ్వింది ... ఆ నవ్వు ఆ

భవనం అంతటా భయంకరంగా ప్రతిధ్వనిస్తుంది ..

ప్రతీకారం .. నా అడ్డ్డు తొలగించు కొనేందుకు నన్ను ప్రాణాలతో లేకుండా చేసారు . ఏ మహల్ పై ఆశ పడ్డానో ఆ

మహల్ నే నా సమాధి చేశారు .. నేను ఊరుకుo టానా ? నా శరీరం లో జీవాన్ని దూరం చేశారు .. కానీ నా

మనసులో కోపాన్ని , మహల్ దక్కించుకోవాలన్న నా కోరిక ని నానుండి దూరం చేయగలిగారా ? లేదు .........

ఎప్పటికి రాణి మహల్ నాదే ........ గట్టిగా అరచింది వైజయంతి .

వైజయంతీ .. ఒక ఉత్తమ వంశం లో పుట్టిన నీవు ఇలా చేయడం సరికానిది . నువ్వు ఆ మహల్ లో ఓ ప్రేతం వై

తిరుగుతున్నావు . ఎందరి ప్రాణా లనో పొట్టన పెట్టుకొని దానిని దెయ్యాల మహల్ గా మార్చేసావు .. నీ దుశ్చర్యల

వల్ల ఇక్కడి ప్రజలు నష్టపోతున్నారు . కష్టాలతో ,ఇక్కట్లతో నలిగిపోతున్నారు .. ఓ రాచ కన్య వైయుండి ప్రజల

గురించి ఆలోచన చేయక నీ స్వార్థం తో ఇలా చేయటం తో రాచ కుటుంబానికి మచ్చ తెచ్చినట్టు కాదా ?

ఆవేశం తో వెనక్కి పడుతున్న పాదాలను ఆపి గట్టిగా అరచింది రచన .

ఆహా .. నువ్వు చెప్పే కబుర్లు ఆపు .. ఆస్తి కోసం ఇంతవరకు వచ్చావు ..  నీ వెంట వచ్చిన స్నేహితుల ప్రాణాలను

పణం గా పెట్టిన నీవా ? నాకు నీతులు చెప్పేది .. అన్నది వైజయంతి నిప్పులు కక్కుతున్న చూపులతో ..

అవును వైజయంతీ .. ఆస్తి కోసమే వచ్చాను .. తరతరాల ఖ్యాతి ని , వైష్ణవీ మాత ఆలయాన్ని దక్కించుకోవాలని

చెడుని అంతం చేయాలని .. మంచి ని స్థాపించాలని వచ్చాను .. ఇక్కడి ప్రజలను ఇక్కట్ల నుండి తప్పించాలని

వచ్చాను . బ్రిటిష్ వారి నుండి భారతీయులకి స్వాతంత్ర్యం లభించింది వైజయంతి .. రావణ పురo ప్రజలకి నీ నుండి

స్వాతంత్ర్యం రావాలి ....... అందుకు నా ప్రాణాలను అడ్డేసి మరీ పోరాడతాను .. అంది రచన .

ఈ వంశపు మొండితనం ,ధైర్యం నీలోను ఉన్నాయే పిల్లా .. కానీ ఎంతైనా ఇది నీ కోరిక .. అది నువ్వు

ఒప్పుకోవాల్సిందే .. కానీ నీ స్వార్థానికి వీరిని బలి ఇవ్వటం రాచ కుటుంబం లో పుట్టిన నీకు మాత్రం ?

సముచితమేనా ? వెటకారం గా అంది వైజయంతి .

వైజయంతీ .. నువ్వు వీరిని ఏమీ చెయ్యలేవు .. అది నీకు ఇది వరకే చెప్పాను .. అది నీ బలహీనత .. అంది రచన .

నిజమే .. ఒప్పుకుంటాను .. కానీ .. మిమ్మల్ని మీరే అంతం చేసుకునేలా చేయగలను .. అడుగు నీ స్నేహితురాలిని

అంది వైజయంతి

ఇంకా ఉంది .


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: