Powered By Blogger

Tuesday 20 May 2014

రుధిర సౌధం 150

వైజయంతి మాటలకి హతాసురాలై కింద పరుండి బాధతో విల విల లాడుతున్న సత్య వైపు చూసింది రచన .

కన్నీళ్లు నిండిన కళ్ళతో ' రచనా .. ఈ నరకాన్ని అనుభవించే శక్తి ఇక నాలో లేదు .. దయచేసి నన్ను విడిచి

పెట్టమని చెప్పు రచనా .. నేనే నా ప్రాణాలను తీసేసుకుంటాను .. మీ ఎవ్వరి దారులకి అడ్డురాను .. నన్ను సుఖంగా

చావనివ్వండి .. " దీనంగా ఏడుస్తూ అంది సత్య .

సత్యా .. కాస్త ధైర్యంగా ఉండు .. నిన్ను క్షేమం గా ఇక్కడ నుండి తీసుకువెళతాను .. అంది రచన .

రచనా .. నా యాతన ఇంకా నీకు అర్థం కావడం లేదా? దయచేసి నా ప్రాణం నువ్వే నీ చేతులతో తీసేయి .. నన్ను

చంపేయ్ .. అని వేదన తో ఆవేశంగా అంది రచన .

వైజయంతీ .. నీ కోపం నా మీద .. ఇలా నన్ను శిక్షించు .. అంతే గని ఇలా సత్యని కాదు .. సత్య ని వదిలేయ్ ..

నువ్వు ఇలా చేయటం సరైంది కాదు .. అంది రచన .

చూడు రచనా .. నువ్వెన్ని చెప్పినా సత్య ఇక్కడ్నుంచి తప్పించుకోలేదు .. ఉన్నదల్లా ఒక్కటే మార్గం .. నా దారి లో

నువ్వే అడ్డు . స్వచ్చందంగా నువ్వు నిన్ను అంతం చేసుకో .. అప్పుడే నీ స్నేహితులతో నాకు శత్రుత్వం ఏమీ లేదు

కనుక వారిని విడిచి పెడతాను . నీవల్ల వాళ్ళు ఇంత బాధ పడుతున్నందుకు వారికి నువ్వు విముక్తి  కలిగించి

వెళ్ళిపో .. ఈ లోకం నుంచి .. అంది వైజయంతి .

రచన విస్మయంగా చూసింది .. వైజయంతి కేసి .

సత్య అంది .. ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు రచనా .. నీ ప్రాణం మీద కొచ్చేసరికి ఇంతలా ఆలోచిస్తున్నవా?

కానీ మా ప్రాణాలను పణం గా పెట్టేందుకు ఏమాత్రం ఆలోచించలేదు నీవు .. ఈ నరక యాతన నువ్వు అనుభవించి

ఉంటె తెలిసుండేది .. నన్ను , మురారి ని విడదీసిన పాపం నీదే .. శివ , యశ్వంత్ .. అందరూ నిన్ను నమ్మి కష్టాల

పాలయ్యాం .. ఇంకా చాలు .. ఒకటి నన్ను చంపేసి .. మురారితో నన్ను చంపెసానని చెప్పు .. రెండోది .. నువ్వు ..

వెళ్ళిపోయి మమ్మల్ని బ్రతకనివ్వు .. బాధగా ఆవేశంగా అంది సత్య .

సత్య మాటలు రచన ని నిలువెల్లా చీల్చేసినట్లని పించింది ..

మాట రాక స్తానువై పోయింది .. మనసు బాధగా మూలిగింది ..

వైజయంతి భయంకరం గా నవ్వింది ..

ఇప్పుడు నీ స్థితి .. నాకు అర్థమవుతుంటే సంతోషంగా ఉంది .. అంది వైజయంతి .

మౌనంగా ఉన్న ఆమె .. పెదవి విప్పి .. సరే  వైజయంతి .. రాచ కుటుంబం మాట తప్పదు .. కావున .. నువ్వు

సత్యని విడిచి పెట్టు .. నేను ఆత్మార్పణ చేసుకుంటాను .. అంది రచన వణుకుతున్న గొంతుతో ..

దగ్గరలోనే ఉన్న పర్వతం నీకోసం ఎదురుచూస్తుంది వెళ్ళు .. అంది వైజయంతి ..

హ .. వెళ్తున్నా .. అని సత్య వైపు బాధగా చూసి .. సత్యా ,,ఎన్నో చెప్పాలని ఉంది .. కానీ మాటలు పెగలటం లేదు .

ఇంకా సెలవు అని ముందుకి నడిచింది రచన

ఇంకా ఉంది 







మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: