రచనా నువ్వు వెళ్ళు ముందు అన్నాడు యశ్వంత్ ..
రచన ముందుకి వంగి ఆ సొరంగ మార్గం లో ప్రవేశించింది .. వెనకాలే యశ్వంత్ , శివ , మురారి లోపలికి
ప్రవేశించారు .. లోపలంతా జలమయం .. పీకల్లోతు నీటిలో ఉన్నారు వాళ్ళు .
ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం గా ఉంది ..
ఆ నీటి అద్దం లోంచి అందం గా కనబడుతుంది అమ్మవారి ఆలయపు సింహద్వారం .. మురారి , శివలకి అదే
మొదటిసారి కావటం తో అబ్బురంగా చూశారు .
యశ్వంత్ రచన నీటిలో అతికష్టం గా ద్వారం వైపు కదలటం చూసి శివ , మురారి కూడా ముందుకి కదిలారు ...
అతికష్టం గా అందరూ సింహద్వారాన్ని చేరుకున్నారు .. సింహాద్వారాని కున్న తాయెత్తు చూసి .. రచనా .. లాస్ట్
టైం దీన్ని తాకే నేను దూరం గా పడిపోయాను .. అన్నాడు మురారి .
మురారి ,శివ ఆ ద్వారాన్ని సునిశితంగా గమనించారు .. ప్రాచీన శిల్పకళా ,హస్తకళల నైపుణ్యం అంతా రంగరించి
నట్టుంది ఆ ప్రాంగణం అంతా .. ఆసక్తి గా అంతా రచన వైపు చూశారు ..
ఆమె కనులు మూసుకుని మనసులోనే ఏదో మంత్రం పఠిoచటం చూసి వాళ్ళు మనసులో అమ్మవారిని
ప్రార్థించారు .
మెల్లిగా కళ్ళు తెరచి ఆ తాయెత్తు వైపు చూసింది రచన ... ఆశ్చర్యం .. ఆ తాయెత్తు ముడులు వాటంతట అవే
వీడిపోతున్నాయి.. ఆనందం పట్టలేక పోయారు ఆ మిత్ర బృందం ..
తాయెత్తు వీడి నీటిలో కలసి పోయింది .. భళ్ళున తలుపులు వాటంతట అవే తెరచుకున్నాయి ..
జై వైష్ణవీ మాతా .. అనుకుంటూ లోపలికి అడుగు పెట్టారు అందరూ ..
లోపలంతా వేల స్తంభాలు నిటారుగా నిలుచుని ఉన్నాయి .. పెద్ద ప్రాంగణం .. అంతా నీరు వ్యాపించి ఉంది ..
కాకపోతే వాళ్ళు గుడి లోకి ప్రవేశించాక నీటి మట్టం తగ్గి వాళ్ళ భుజాలకి దిగువగా ఉంది ..
హౌ నైస్ .. ఇలాంటి టెంపుల్ నేనింత వరకూ చూడనే లేదు .. అన్నాడు శివ చుట్టూ పరికిస్తూ ....
నిజమే .. భూగర్భంలో ఇంత అందం గా ఈ ఆలయం కట్టారంటే ఆశ్చర్యంగా ఉంది .. అన్నాడు యశ్వంత్ .
భూగర్భంలో కాదు యశ్వంత్ భూమిపైనే కట్టారు ఈ ఆలయాన్ని .... కానీ క్రమేపీ ఈ ఆలయం భూమిలోకి
కూరుకుపోయింది .. అది ఆ తాంత్రిక శక్తి వల్ల కావొచ్చు లేదంటే మరేదైనా కారణం ఉండొచ్చు .. అంది చుట్టూ
పరికించి చూస్తూ రచన .
రచన .. అదుగో .. అదే గర్భ గుడి అనుకుంటా .. అన్నాడు మురారి .
అవును మురారీ .. అని .. పదండి అటు వెళదాం .. అంది రచన .
అందరూ గర్భగుడి ముందు కి చేరారు .. తలుపులు మూసి ఉన్నాయి ... రచన పెదవులు మళ్ళి ఏదో మంత్రాన్ని
ఉచ్చారిస్తున్నాయి ..
ఈ ఆలయం యొక్క గర్భాలయాన్ని .. అమ్మవారి సేవికలే కాపు కాస్తున్నాయని ఆ గ్రంథం లో ఉంది .. వారిని
ప్రసన్నం చేసుకుంటే ఆలయ ద్వారాలు తెరచు కుంటాయి .. స్వామీజీ మనకిచ్చిన నైవేద్యం అష్ట దిక్కులా చల్లండి
అన్నాడు యశ్వంత్ .
భుజానికి ఉన్న బాగ్ లోంచి ఓ ప్యాకెట్ తీసి అందులో నైవేద్యాన్ని అన్ని దిక్కులా వేసి వచ్చారు .. శివ , మురారి ..
రచన కళ్ళు తెరచే సరికి శివ , మురారిలు తమ పని కానించి వచ్చారు .. రచన కళ్ళు తెరవగానే గుడి తలుపులు
బార్లా తెరచుకున్నాయి ..
ఇంకా ఉంది
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది




No comments:
Post a Comment