Powered By Blogger

Monday 15 September 2014

రుధిర సౌధం 244

వావ్ .. ఇది నిజంగా అద్భుతమే .. అన్నాడు యశ్వంత్ ..

ఆ తరువాత .. ఆసక్తిగా అడిగారు శివ , మురారి ఆసక్తిగా ..

ఆ తరువాత .. ఇంకేముంది .. విగ్రహాన్ని యథా స్థానానికి తెచ్చే ప్రక్రియలో .. విగ్రహాన్ని పడమట దిక్కుని చూసే

విధం గా తిప్పవలసి ఉంటుంది .. అటు చూడండి .. విగ్రహం పక్కకి  వైపు .. అతి పెద్ద రాతి ప్రమిద ఉంది .. మనం

దానిలో మొట్ట మొదటిగా దీపం వెలిగించడానికే నెయ్యి ని తీసుకువచ్చాం .. అది ఎంతో కాలం నుండి అఖండ జ్యోతి

గా వెలిగింది .. ఆ జ్యోతి ఆరిపోయాకే .. ఈ మహల్ కి చెడ్డ రోజులు వచ్చాయి .. అందుకే ఆ శ్లోకం లో కూడా

పడమరని చూసిన వాలుజడ కనబడుతుంది .. అంటే అమ్మవారి వెనుకభాగం .. ఉత్తరానికి తిప్పగానే ఆ జ్యోతి ..

మళ్ళి తూర్పు చూడటమంటే .. విగ్రహం యథాస్థితి కి వస్తుందన్న మాట .. ఈ ప్రక్రియ లో ఈ వాటర్ అంతా విగ్రహం

కింద ఉన్న సెలయేటి లోకి చేరుకుంటుంది .. నీరు అంతా పోయాక విగ్రహం యథా స్థితి కి వచ్చినప్పుడు రంధ్రాలు

మళ్ళి మూయ బడతాయి .. అంది రచన విగ్రహం వైపు చూస్తూ ..




చాలా బాగా అర్థమైంది నీకా శ్లోకం .. నీ తెలివి తేటలు అమోఘం .. అన్నాడు శివ .

ఈ విగ్రహాన్ని మనం కదపగలమoటావా ? అన్నాడు మురారి ..

ఇంత వరకూ వచ్చాక అనుమానం ఎందుకు ? మంచి పనికి ఆలస్యం పనికి రాదు .. అని రచన వైపు చూసి ..

విగ్రహాన్ని మనం తాక వచ్చు కదా ? అని అడిగాడు యశ్వంత్ .

యశ్వంత్ విగ్రహాన్ని నేను మాత్రమే కదపగలను .. మీరిక్కడే ఉండండి .. అని ఆమె ముందుకి వంగి గర్భగుడి

ద్వారానికి  నమస్కరించి  లోపలికి ప్రవేశించింది .. అప్పుడు పడింది ఆమె దృష్టి అమ్మవారి మెడలో ఉన్న హారం

మీద .. ఈ హారమే అనుకుంటా వీరస్వామి అడిగింది .. అనుకొని విగ్రహం కి నమస్కరించి ఆమె హారం

తీయబోతుండగా  ఆమె ఉద్దేశ్యం అర్థమైన వాడిలా .. రచనా .. ప్లీజ్ .. ఈరోజుకి ఉండనీ ,.. ఆ హారాన్ని .. ఈరోజు

ఆమె నుండి ఆ హారాన్ని దూరం చేయకు అన్నాడు యశ్వంత్ .

ఆమె యశ్వంత్ వైపు తిరిగి .. కానీ యశ్వంత్ .. అది .. అంది సందేహంగా రచన .

రచనా .. వద్దు .. అంతా మంచే జరుగుతుంది .. ఇప్పుడు వేరోకరికోసం ఆలోచన వద్దు .. హారాన్ని ఉండనీ ..

అన్నాడు శివ ..

అలాగేనని తల ఊపి అమ్మ కి మనసారా నమస్కరించి .. ఆ శ్లోకాన్ని చదువుతూ విగ్రహాన్ని కుడివైపు కి తిప్పింది .

రచన చెప్పినట్టే విగ్రహం అటువైపు తిరిగింది .. అంత వరకూ ఉన్న విగ్రహం పక్కకి జరగగానే రంధ్రాలు బయట

పడ్డాయి .. కింద ప్రవహిస్తున్న అంతర్వాహిని పరవళ్ళ శబ్దాలు ఆమెకి స్పష్టం గా వినిపించాయి .. మెల్లిగా  వాళ్ళ

చుట్టూ ఉన్న నీరంతా ఆ రంధ్రాల గుండా అంతర్వాహినిలో కలసి పోయింది ..

అబ్బురంగా చూశారు అంతా ఆ దృశ్యాన్ని ..

వెంటనే విగ్రహాన్ని పడమటికి తిప్పింది రచన .. అమ్మవారి వాలుజడ సుందరం గా కనిపించే సరికి ఆ ముగ్గురూ

మనస్ఫూర్తి గా నమస్కరించారు ఆమె కి .

రచన వెంటనే అమ్మవారిని ఉత్తరానికి తిప్పింది .. ఉత్తరాన ఉన్న రాతి ప్రమిదలో కూడా అంత వరకు ఉన్న నీళ్ళు

మాయం మయ్యాయి .. యశ్వంత్ బాగ్ లోంచి నెయ్యి ప్యాకెట్ తీసి ఆమెకి అందించాడు .. శివ ఒత్తులు ఇవ్వగా ..

మురారి అగ్గిపెట్టె తీసి ఇచ్చాడు ..

ఇంకా ఉంది














మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

No comments: